అఙ్ఞాతవాసి షాక్‌లో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ఫోన్ చేసి.. ఆ కబురు చల్లగా?
Recommended Video

ఏ హీరోతోనైనా సరే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ప్రేక్షకులకు ఓ గౌరవం ఉండేది. కానీ అఙ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్‌ను చాలా ఇబ్బందిలో పడేసింది. పవన్ ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్‌ను పబ్లిక్ టాక్ లైవ్‌లోనే కడిగిపారేశారు. కెరీర్‌లోనే ఎన్నడూ చూడనటువంటి ఫ్లాప్‌ను త్రివిక్రమ్ చూశాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, తివిక్రమ్ కాంబినేషన్ తదుపరి చిత్రంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో వెలుగుచూసింది.

త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్ ఫోన్
అఙ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన త్రివిక్రమ్‌కు ఇటీవల ఎన్టీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. పరాజయం బాధలో ఉన్న త్రివిక్రమ్‌కు ధైర్యం చెప్పాడనేది ఆ వార్త సారాంశం.

ఫ్లాప్‌ను పట్టించుకోకు..
ఇండస్ట్రీలో హిట్లు,ఫ్లాపులు చాలా సర్వసాధారణం. అఙ్ఞాతవాసి ఫ్లాప్ గురించి పట్టించుకోవద్దు. తదుపరి సినిమాపై దృష్టిపెట్టండి అని సూచించినట్టు తెలిసింది.

హిట్ కొట్టబోతున్నాం..
తనతో చేసే సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. మీకు ఎలాంటి ఢోకా లేదు. మీరు ఆందోళన పడవద్దు. మన సినిమా మంచి చిత్రంగా మారుతుంది అని ధైర్యాన్ని ఇచ్చినట్టు సమాచారం.

కథ, కథనాలపై దృష్టి
ఈ వెర్షన్ ఇలా ఉండగా, మరోసారి కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టండి. ప్రాజెక్ట్ లేటైనా ఫర్వాలేదు. కథలో క్లారిటీ ఉండాలి. సీన్లలో విషయం ఉండేలా చూసుకోండి అని చెప్పినట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

కాపీరైట్ ప్రాబ్లెం రాకుండా..
కథా, స్క్రీన్ ప్లే తదితర విషయాలను దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా, కాపీరైట్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ను కోరుతున్నట్టు ఓ వార్త సినీ వర్గాల్లో నానుతున్నది. దాంతో ఎన్టీఆర్ జాగ్రత్తలు వ్యవహరించే అవకాశం ఉంది.

అఙ్ఞాతవాసిలో వెంకటేష్
ఇదిలా ఉండగా, అఙ్ఞాతవాసి చిత్రంలోని కొన్ని సీన్లను తొలగించి, కొత్తగా వెంకటేష్ ఉన్న సన్నివేశాలను చేర్చి కొత్తగా అభిమానులకు వినోదం పంచడానికి ఏర్పాట్లు చేశారు. అఙ్ఞాతవాసి చిత్రంలోని కొన్ని సీన్లు సినిమా ఫేట్ ఏమైనా మారుస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











