»   »  ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ... ఇదిగో వివరాలు!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ... ఇదిగో వివరాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడితో సినిమా చేయాలని ఎన్టీఆర్ కూడా ఇంట్రుస్టు చూపుతున్నారు.

ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. అప్ప‌టికే త్రివిక్ర‌మ్ కళ్యాణ్ తో మూవీ కమిట్ కావడంతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. ఈ గ్యాపులో ఎన్టీఆర్ బాబీతో సినిమాకే చెప్పాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరూ సినిమా గురించి ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

 NTR, Trivikram movie details

ప‌వ‌న్ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్. పవన్-త్రివిక్రమ్ మూవీ పూర్తయ్యేలోపు ఎన్టీఆర్-బాబు సినిమా పూర్తి కానుంది. ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల నుండి ఫ్రీ అయ్యాక..... సినిమా మొదలు పెట్టనున్నారు.

ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందే భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అఫీషియల్‌గా వెల్లడికానున్నాయి.

English summary
Trivikram Srinivas will direct NTR next year. The project will go on the floors in September 2017. It will be produced by S Radhakrishna of Haarika & Hassine Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu