‘అరవింద సమేత’.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ టైటిల్ అదుర్స్
Recommended Video

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఎన్టీఆర్ నటించే చిత్రానికి 'అరవింద సమేత' అని టైటిల్ పెట్టారు. వీర రాఘవ ఉప శీర్షికగా పెట్టారు. ఈ టైటిల్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది.

తెలుగు ఫిల్మీబీట్ ముందే ఊహించింది
అరవింద సమేత వీర రాఘవ టైటిల్‌ను తెలుగు ఫిల్మీబీట్ ముందుగానే ఊహించింది. తెలుగు మీడియాలో వచ్చిన మా కథనానికి ఇంటర్నెట్ మాధ్యమంలో మంచి స్పందన లభించింది.

సూపర్ డూపర్ ఖాయమనే టాక్
టైటిల్ విభిన్నంగా ఉన్న ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..... అరవింద సమేత వీర రాఘవ కూడా హిట్ అవుతుంది. సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ పడిన తపన ఆ చిత్ర కథకు ఉన్న ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతున్నది. సిక్స్‌ప్యాక్‌లో ఎన్టీఆర్ అదరగొట్టాడు అనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

పవర్ ఫుల్‌గా ఎన్టీఆర్
వెరైటీ టైటిల్‌పై అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీర రాఘవ టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంతో మరోసారి వెండితెరపైన మ్యాజిక్ చేయడం ఖాయమని అంటున్నారు.

చిత్తూరు యువకుడిగా తారక్
అరవింద సమేత వీర రాఘవ కోసం ఎన్టీఆర్, త్రివిక్రమ్ తొలిసారి జతకట్టారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు ప్రాంతానికి చెందిన యువకుడిగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











