»   » ఆ అపవాదు పోయింది..త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా హిట్టు ఖాయం..!!

ఆ అపవాదు పోయింది..త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా హిట్టు ఖాయం..!!

Subscribe to Filmibeat Telugu
త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా కి అపవాదు పోయిందా ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు అంతా సిద్ధం అవుతోంది. ఈ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. మాటలతోనే మాయ చేసే త్రివిక్రమ్, ఎలాంటి పాత్ర అయినా పిండి చేసే ఎన్టీఆర్.. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి ఉంటుందనే ఊహాగానాలలో ఎన్టీఆర్ అభిమానులు తేలిపోతున్నారు. కానీ అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం కావడంతో కొందరు ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనకు గురి అవుతున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎన్టీఆర్ గత చిత్రాల సెంటిమెంట్ చెబుతోంది. ఆ లెక్కన ఈ సినిమా హిట్టు ఖాయం.

ఎన్టీఆర్ కు అప్పట్లో అపవాదు

ఎన్టీఆర్ కు అప్పట్లో అపవాదు

ఎన్టీఆర్ సక్సెస్ దర్శకుల వెంట పడుతాడనే అపవాదు అప్పట్లో బలంగా వినిపించేది. కిక్ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి, కందిరీగ చిత్రం తరువాత సంతోష్ శ్రీనివాస్, దూకుడు తరువాత శ్రీనువైట్లతో ఇలా విజయాలు ఉన్న దర్శకులని మాత్రం ఎన్టీఆర్ దగ్గరకు చేరనిస్తాడని ఆ మధ్యన ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. క్రమంగా ఆ అపవాదు తొలగిపోయింది. ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రాలే అందుకు నిదర్శనం.

వరుసగా ప్లాప్ డైరెక్టర్ లతోనే

వరుసగా ప్లాప్ డైరెక్టర్ లతోనే

ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్లని నమ్మడం లేదు.. కథలనే నమ్ముకుని ముందుకు వెళుతున్నాడు. అందుకే విజయాలు సొంతం అవుతున్నాయి. కథ నచ్చితే అట్టర్ ప్లాప్ డైరెక్టర్ తో అయినా సినిమా చేయడానికి వెనుకాడడం లేదు.

సుకుమార్ చెప్పిన కథని నమ్మి

సుకుమార్ చెప్పిన కథని నమ్మి

1 నేనొక్కడినే వంటి డిజాస్టర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ సుకుమార్ కు ఒకే చెప్పడం విశేషం. సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో ప్లాప్ లో ఉన్న సరే చేయటానికి వెనుకాడలేదు. సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయం సాధించింది.

ప్లాపుల్లో ఉన్న పూరితో

ప్లాపుల్లో ఉన్న పూరితో

పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ తో టెంపర్ చిత్రం చేసే ముందు వరకు ఈ దర్శకుడు నిఖార్సైన హిట్టు కొట్టి చాలా కాలం అయింది. కానీ వీరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం సూపర్ హిట్ కావడం విశేషం.

నిరాశలో ఉన్న బాబీతో

నిరాశలో ఉన్న బాబీతో

పవర్ చిత్రంతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబీ వెంటనే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో అనూహ్యమైన డిజాస్టర్ ని చవి చూడవలసి వచ్చింది. నిరాశలో ఉన్న బాబీకి ఎన్టీఆర్ తిరిగి లైఫ్ ఇచ్చాడు. జై లవకుశ చిత్రం బాబీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లో నటన పరంగా ఈ చిత్రంతో మరో మెట్టు ఎక్కాడు.

లేటెస్ట్ గా అజ్ఞాతవాసి షాక్ తరువాత

లేటెస్ట్ గా అజ్ఞాతవాసి షాక్ తరువాత

ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నది ప్లాప్ డైరెక్టర్ తోనే. అజ్ఞాతవాసి చిత్రం త్రివిక్రమ్ కు ఎలాంటి షాక్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకే ఈ చిత్రం మచ్చగా మారింది. వీరిద్దరో కాంబినేషన్లో త్వరలో చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.

ఆ లెక్కన హిట్టేగా

ఆ లెక్కన హిట్టేగా

ఎన్టీఆర్ కొంత కాలంగా ప్లాప్ డైరెక్టర్ లతో చేస్తున్న చిత్రాలన్నీ విజయాలు సాధిస్తున్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కూడా హిట్టు పక్కా అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

English summary
If sentiment will workout.. NTR and Trivikram movie will be a hit. NTR previous record look like that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu