ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ.. రూమర్లపై సీరియస్..
Recommended Video

నిజం గడప దాటకముందే.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందనే సామెత సినిమా పరిశ్రమకు చాలా చక్కగా సరిపోతుంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న రకరకాల రూమర్లు మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కథ విషయంలో విభేదాలు వచ్చాయని, కీలక పాత్రలో ప్రముఖ నటి విషయంలో ఏదో జరిగిందనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లకు తెర దించేందుకు చిత్ర యూనిట్‌ను ఫోన్‌లో తెలుగు ఫిల్మీబీట్ సంప్రదించగా.. ప్రాజెక్ట్ ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చారు.

ఆ వార్తలన్నీ గాసిప్సే..
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విషయంలో వస్తున్న గాసిప్ వార్తల్లో నిజం లేదు. సినిమా ఆగిపోలేదు. ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుంది. మూమ్మాటికి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని వివరణ ఇచ్చారు.

నటీనటుల ఎంపిక జరుగలేదు
అలాగే సీనియర్ నటి ఎంపిక విషయంలో విభేదాలు వచ్చాయనే విషయం కూడా అవాస్తవమే. ఇంకా నటీనటుల ఎంపిక జరుగలేదు. పూర్తి కాలేదు. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తారు అని చెప్పారు.

పవన్ సినిమాపై త్రివిక్రమ్ దృష్టి
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి సమయాన్ని కేటాయించారు. పవన్ సినిమా సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అవుతుంది అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన కీలక వ్యక్తి వెల్లడించారు.

అవాస్తవాలు రాయొద్దు
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా గురించి అవాస్తవాలు రాయొద్దు అని సూచించారు. ఏదైనా సమాచారం అవసరమైతే తెలుసుకొని రాయాలి అని చెప్పారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కథలో గానీ, ప్రాజెక్ట్ ముందుకెళ్లే విషయంలో గానీ ఎలాంటి సందేహాలు లేవు అని వారు పేర్కొన్నారు.

పవన్ 25వ సినిమా తర్వాత
అక్టోబర్ రెండోవారంలో పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవన్ 25వ సినిమా రిలీజ్ కాగానే సెట్స్ పైకి వెళ్లనున్నదని అప్పుడే వెల్లడించారు. కానీ ఈ మధ్యకాలంలో అనేక రూమర్లు రావడంతో వాటికి చిత్ర యూనిట్ తెర దించింది.


Click it and Unblock the Notifications











