అరవింద సమేత పబ్లిక్ టాక్: ఫస్టాఫ్ అదిరింది.. గురూజీ గురి తప్పలేదు
అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మరోసారి ఎన్టీఆర్‌ను వీర రాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు. మహిళా సాధికారిత ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు త్రివిక్రమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వివరించారు. ఓవరాల్‌గా టాక్ ఎలా ఉందంటే..

తొలి 30 నిమిషాలు
అరవింద సమేత చిత్రం తొలి 30 నిమిషాలు కేక పుట్టించేలా ఉంది. రావు రమేష్ సీన్ బాగా పండింది. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫస్టాప్ సాగింది. తొలి భాగం అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ ముందు బ్లాస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి

కథ నుంచి డీవియేట్ కాలేదు
అరవింద సమేతలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడ కనిపించదు. కథ నుంచి డీవియేట్ కాకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈసారి నిజమైన పండుగగా దసరా మారబోతున్నది.
Recommended Video


ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఎన్టీఆర్ స్టామినాకు అద్దం పట్టింది. ఫస్టాప్‌లో పాటల్లో ఎన్టీఆర్ స్టెప్స్ బాగున్నాయి. తివిక్రమ్ గురితప్పకుండా దూసుకుపోయాడు. ప్రతీ క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉండేలా డిజైన్ చేశాడు.

అరవింద నిరుత్సాహ పరచదు
ఎన్టీఆర్ స్టామినాను నమ్ముకొండి. త్రివిక్రమ్ ప్రతిభ మ్యాజిక్ చేస్తుంది. అరవింద సమేత మిమ్మల్ని ఎక్కడా నిరూత్సాహపరుచదు అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











