»   » త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తోనే...

త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఎన్టీఆర్‌తోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ తర్వాత జూ ఎన్టీఆర్ చేయబోయే తర్వాతి సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినినిమా రాబోతోందని గతంలో వార్తలొచ్చాయి. కానీ త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల సినిమా ప్రారంభం అయింది. దీంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పుడప్పుడే సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అయితే పవన్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కనుందని, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు భారీ మొత్తం పారితోషికం ఇచ్చేందుకు డీల్ కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
After Pawan Kalyan movie Trivikram to team up with NTR.
Please Wait while comments are loading...