లయన్ అంటూ... బాబాయ్ గురించి ఎన్టీఆర్ ట్వీట్
హైదరాబాద్: బాబాయ్ బాలకృష్ణకు, అబ్బాయ్ జూ ఎన్టీఆర్ కు మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని చాలా కాలంగా మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కేవలం పుక్కిటి పుకార్లే అని, ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తాజాగా తేటతెల్లం అయింది. తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్లో బాబాయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనం.

బాలయ్య సినిమా షూటింగులో నిన్న గాయ పడ్డారు. ఈ విషయమై ఎన్టీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సింహం క్షేమంగానే ఉంది. మళ్లీ వచ్చి గర్జిస్తుంది' అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేసారు. కొడుకు పుట్టిన ఆనందంలో చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ట్విట్టర్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొడుకు పుట్టిన విషయం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ట్వీట్ బాబాయ్ గురించే చేయడం గమనార్హం.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బాలయ్య సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సమక్షంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా...చాలా రీస్కీ ఫైట్స్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కళ: రవీందర్, కార్యనిర్వాహక నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాత: రుద్రపాటి రమణారావు, రచన-దర్శకత్వం: సత్యదేవ.


Click it and Unblock the Notifications











