»   » ‘నాన్నకు ప్రేమతో’ ఓపెనింగ్స్ అదిరాయి, ఎన్టీఆర్ థాంక్స్!

‘నాన్నకు ప్రేమతో’ ఓపెనింగ్స్ అదిరాయి, ఎన్టీఆర్ థాంక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' తొలి రోజు భారీ ఓపెన్సింగ్ సాధించింది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో' సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తొల రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ 85 శాతం ఆక్యుపెన్సీ సాధించిందని అంటున్నారు.

ఏపీ, తెలంగాల్లో ఈ చిత్రం తొలి రోజు రూ. 15 కోట్ల షేర్ సాధించినట్లు అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ రూ. 23 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఓపెనింగ్స్ విషయంలో ‘బాహుబలి' టాప్. ఇక నాన్ బాహుబలి సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ‘శ్రీమంతుడు' టాపులో ఉంది. శ్రీమంతుడు చిత్రం తొలి రోజు ఏపీ, నైజాంలో రూ. 14.72 కోట్ల షేర్ సాధించింది.


నాన్నకు ప్రేమతో షేర్ రూ. 15 కోట్లు దాటిందని టాక్. నాన్నకు ప్రేమతో తొలి రోజు కలెక్షన్ విషయమై ఇంకా అఫీషియల్ డీటేల్స్ రాలేదు. ఆ డీటేల్స్ బయటకు వస్తే.... ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టిందా? లేదా? అనే విషయమై ఓ క్లారిటీ వచ్చే అకాశం ఉంది.


NTR tweet about Nannaku Prematho

మరో వైపు ఈ చిత్రం హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, ఖమ్మం, కర్నూలు, విజయనగరం ప్రాంతాల్లో తొలి రోజు ఓపెనింగ్స్ విషయంలో ‘బాహుబలి' రికార్డులను సైతం బద్దలు కొట్టిందని టాక్. ఈ టాక్ ఎలా ఉన్నా అఫీషియల్ సమాచారం బయటకు వస్తే తప్ప ఏ విషయం తేల్చలేం.


కాగా.... ‘నాన్నకు ప్రేమతో' సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ రావడంపై ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ హధ్య కాలంలో ఎన్టీఆర్ కు సరైన హిట్ లేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కు దాటలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో పాటు, రూ. 50 కోట్ల మార్కు దాటుతాడని అంటున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.English summary
"Thanks one and all for a very memorable response for #NannakuPrematho.deeply humbled.the whole team will cherish this for a very long time" NTR tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu