వాళ్ళ అమ్మ నుంచి అభయ్‌ని కాపాడలేను.. భయంతో దీనంగా చూస్తున ఎన్టీఆర్ కొడుకు!
ఎన్టీఆర్ తన కుమారుడు అభయ్ రామ్ ముచ్చట్లని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తన సతీమణి లక్ష్మి ప్రణతి, అభయ్ రామ్ అందమైన ఫోటోని ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ వైరల్ గా మారింది.

లక్ష్మి ప్రణతి తన కొడుకు పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆమె నుంచి నేను కూడా అభయ్ ని కాపాడలేనని సరదాగా కామెంట్ చేశాడు. ప్రతిరోజు పాలు తాగడానికి చాలా మంది చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. కానీ లక్ష్మి ప్రణతి అంత సులువుగా విడిచిపెట్టేలా లేదు. అభయ్ ని కూర్చో బెట్టి మరి పాలు తాగిస్తోంది.
చేసేది లేక బిక్కు బిక్కుమంటూ తాగలేక పాలు తాగుతున్న అభయ్ రామ్ చూపులు అమాయకంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ పట్ల తన భార్య ఎంత కేర్ తీసుకుంటుందో ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











