twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్‌డే రోజు..ఎన్టీఆర్‌ను అప్‌సెట్ చేసిన రాజమౌళి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మే 20న ఇరవై తొమ్మిదవ వడిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పుట్టిన రోజును పురస్కరించుకుని జూనియర్ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా వారికోసం స్పెషల్‌గా కొన్ని వంటకాలు చేయించడంతో పాట చాకొలెట్‌తో చేసిన పదార్థాలు, కేకులు వడ్డించారు.

    ఈ బర్త్‌డే వేడుకకు హాజరైన దర్శకుడు రాజమౌళి అవేవీ ముట్టుకోలేదు. కారణం రాజమౌళి గత వారం రోజుల నుంచి కఠినమైన డైట్ మెయింటేన్ చేస్తుండటమే. బాహుబలి సినిమాలో తెరపై కనిపించడానికి ప్లాన్ చేసుకుంటున్న రాజమౌళి ఫిట్‌గా ఉండేందుకు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    తన పుట్టిన రోజు వేడుకలో ప్రత్యేకంగా తయారు చేయించిన పదార్థాలు రాజమౌళి టేస్ట్ చేయక పోవడంతో జూ ఎన్టీఆర్ చాలా అప్ సెట్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వడ్డించిన కొన్ని పదార్ధాలకు సంబంధించిన ఫోటోను రాజమౌళి తన ట్విట్టల్లో పోస్టు చేసాడు. డైటింగ్ చేస్తున్న కారణంగా ఆ పదార్ధాలకు దూరంగా ఉండాలనుకున్నా, కానీ తారక్ బలవంతం చేయడంతో టేస్ట్ చేయక తప్పలేదని ట్వీట్ చేసాడు.

    'బాహుబలి' సినిమాలో రాజమౌళి ఓ ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం తన రూపాన్ని ఆకర్షణీయంగా తయారు చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తన మీసాలను 'సింగం' సినిమాలో సూర్య మాదిరి పెంచేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

    English summary
    NTR celebrated his birthday yesterday. The actor invited his close friends for a lavish party and as can be expected, the choices delicacies were served there. Rajamouli put up this photo on his twitter account, showing some of the desserts served at the party. “Have been dieting strictly for the past week. All Gone for toss at tarak’s birthday bash”, he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X