ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త!!

''వినాయక్ సినిమాలో చేయడమంటే నాకు చాలా సంతోషం. నాని అన్నతో ఇది రెండో సినిమా. వంశీతో మొదటిది. హిట్ సినిమాను తీయాలన్న కాంక్షతో పనిచేస్తున్నాం. తప్పక విజయం వరిస్తుందన్న నమ్మకం ఉంద''ని ఎన్టీఆర్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయ''ని అన్నారు. ఇలియానా కథానాయిక. 40 మంది ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇక ఈ చిత్రానికి కథ, మాటలుని వరసగా హిట్స్ ఇస్తున్న కోన వెంకట్ అందిస్తున్నారు. అలాగే సంగీతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తూంటే...కెమెరా: ఛోటా కె.నాయుడు, ఫైట్స్: స్టన్ శివ, కళ: ఆనంద్‌సాయి, కూర్పు: గౌతం రాజు చేయనున్నారు. అంటే త్వరలోనే ఆది లాంటి బ్లాక్ బస్టర్ రానుందన్నమాట.ఎన్టీఆర్ అభిమానులకు పండుగే కదా మరి.


Click it and Unblock the Notifications











