సక్సెస్‌కు బంధువులు ఎక్కువ...జూ. ఎన్టీఆర్ సెటైర్
సక్సెస్‌కు బంధువులు ఎక్కువని, ఫెయిల్యూర్ అనాథగా మిగులుతుందని ఎన్టీఆర్ అన్నారు. అలాగే బృందావనం చిత్రంతో ఎంతో మంది బంధువులను ఏర్పరచుకున్నట్లు చెప్పారు. కాజల్, సమంత, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన బృందావనం సినిమా విడుదల సందర్భంగా నిర్మాత దిల్‌రాజుతో కలిసి గురువారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుదర్శన్ థియేటర్‌లో ఫస్ట్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తనకు బృందావనం సినిమాతో అన్ని రకాల పాత్రల్లో నటించాలనే స్వార్థం పెరిగిందని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. క్లాస్, మాస్, ఫ్యామిలి ఎంటర్‌టైన్‌మెంటు సినిమా అని తెలిపారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తే చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందన్నారు. టీమ్ వర్క్‌తో సక్సెస్ సాధించినట్లు చెప్పారు. ఇదే హాల్లో ఉదయం ఆటను బృందావనం దర్శకుడు వంశీ పైడితల్లి, నటుడు శ్రీహరి, హీరోయిన్ సమంత, ఛాయాగ్రహకుడు చోటాకె నాయుడు చూసారు.


Click it and Unblock the Notifications











