తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సంక్షోభంలేదని, రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం మామూలేనని జూనియర్ ఎన్టీఆర్ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. తాతయ్య దీవనతోనే తాను ప్రమాదం నుండి బయటపడ్డానని ఆయన అన్నారు. ప్రతియేట నిమ్మకూరులో పర్యటించి, తాతయ్య, నానమ్మల విగ్రహాలను దర్శించుకోవడం తనకు ఆనవాయితని జూనియర్ తెలిపారు. ఎన్టీఆర్ ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని గుడివాడ, నిమ్మకూరులో ఆయన పర్యటించనున్నారు. రోడ్డు ప్రమాదం నుండి బయటపడిన తర్వాత జూనియర్ కృష్ణా జిల్లాలో పర్యటించడంతో ఇదే తొలిసారి.
Story first published: Sunday, July 12, 2009, 13:26 [IST]