twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' ఆడియో రోజున ఎన్టీఆర్ స్పెషల్ టూర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం ఆడియో మార్చి 17 న విడిదల చేస్తున్న సంగతి తెలిసిందే. నానక్ రామ్ ... రామానాయుడు స్టూడియో లో ఈ ఆడియో విడుదల ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది. అదే రోజు ఎన్టీఆర్..తిరుమల, సింహాచలం దర్శించుకుని హైదరాబాద్ వచ్చి ఆడియో పంక్షన్ లో పాల్గొంటారని నిర్మాత బండ్ల గణేష్ తెలియచేసారు. ఆ స్పెషల్ ప్లైట్ లో బండ్ల గణేష్, శ్రీను వైట్ల కూడా ఉంటారు.

    హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.

    జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాద్ షా' ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. 'బాద్ షా' ఆడియో కార్యక్రమం మార్చి 17 వ తేదిన జరుగనుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులను 'బాద్ షా' పాటలు ఆకట్టుకునే విధంగా తమన్ సంగీతాన్ని అందించారని ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేష్ గుప్తా తెలిపారు.

    English summary
    
 Producer Bandla Ganesh revealed that NTR will visit the temple in Tirumala and Simhachalam to seek blessings before flying back to Hyderabad. Sreenu Vaitla and Bandla Ganesh will accompany NTR in a special chartered flight during this visit on March 17. Since the audio launch had to be called off from its original date (March 10), security is going to be beefed up for the main event on March 17 to ensure that everything goes on smoothly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X