వెంకటేశ్వరుని పాదాల చెంత ఎన్టీఆర్ స్క్రిప్టు
ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో ప్రారంభం కానున్న శక్తి చిత్రం స్క్రిప్టును తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద పెట్టి ఈ రోజు (మంగళవారం) పూజలు చేసారు. ఈ పూజకోసం ఎన్టీఆర్ సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు, నుదుటన తిరుచూర్ణం ధరించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్సకుడు మెహర్ రమేష్, పలువురు యూనిట్ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఇదంతా తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది. ఆ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్రాంతికి విడుదలవుతున్న తన సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా చూసి విజయవంతం చేయాలని ఎన్టీఆర్ శ్రీవారికి విన్నవించుకున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇక 'శక్తి' చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని నిర్మించారు. దానికి కూడా మెహర్ రమేష్ డైరక్షన్ వహించారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా కూడా ఎన్టీఆర్ బృందావనం అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ తో మున్నా తీసిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, వివి వినాయిక్ తో చేసిన అదుర్స్ చిత్రం రేపు(బుధవారం) విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











