twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్‌గా... ఎన్టీఆర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వబౌమ నటరత్న బిరుదాంకితులు, కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకున్న నందమూరి తారకరామారావు 'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్'గా ఎంపికయ్యారు. ఇండియన్ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిఎన్ఎన్ ఐబిఎన్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన పోల్‌లో ఈ విషయం వెల్లడించింది.

    ఎన్టీ రామా రావు , బల్రాజ్ సహని, దిలీప్ కుమార్, గురు దత్త్, ఓం పూరి, నసీరుద్దిన్ షా, ఎంజి రామచంద్రన్, శివాజీ గణేషన్, ఉత్తమ కుమార్, డా. రాజ్‌కుమార్, కమల్ హాసన్, మోహన్ లాల్, సౌమిత్రో చటోపాధ్యాయి, సంజీవ్ కుమార్, జెమినీ గణేశన్, పంకజ్ కపూర్, మమూట్టి, మిథున్ చక్రవర్తి, ఉత్పల్ దత్, ఛబ్బి బిస్వాల్ లాంటి వారి పేర్లు పోటీలో ఉన్నాయి.

    ఎన్టీ రామారావు 53% ఓట్లు దక్కించుకుని 'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్'గా నిలిచారు. ఈ పోల్‌లో తమిళ నటుడు కమల్ హాసన్ 44% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మలయాళం నటుడు మోహన్ లాల్, కన్నడ లెజెండ్ డాక్టర్ రాజ్ కుమార్ కేవలం 1% చొప్పున ఓట్లు దక్కించుకున్నారు. మిగిలినే వారెవరూ కనీసం ఒక శాతం ఓట్లు కూడా దక్కించుకోలేక పోయారు.

    ఇక హీరోయిన్ల విషయంలో అతికలోక సుందరి శ్రీదేవి 'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ హీరోయిన్'గా ఎంపికయింది. 39% ఓట్లు శ్రీదేవికి దక్కగా, మాధురి దీక్షిత్ 16% ఓట్లతో రెండో స్థానంలో, తెలుగు నటి సావిత్రి 12% ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. ఈ పోల్ లో వహీదా రెహ్మాన్, మధుబాల, నర్గీస్, సాబిత్రి చటర్జీ, మీనా కుమారి, నూతన్, షబానా అజ్మి, స్మితా పాటిల్, దీప్తి నావల్, మాధురి దీక్షిత్, మాధబి ముఖర్జీ, శారద, బి సరోజాదేవి, రాఖీ గుల్జార్, కొమ్మారెడ్డి సావిత్రి, సుచిత్ర సేన్, దేవిక రాణి, ఐశ్వర్య రాయ్ లాంటి వారు పోటీ పడ్డారు. అందాల తార ఐశ్వర్యకు కేవలం 8% ఓట్లు మాత్రమే పడ్డాయి.

    English summary
    Telugu legend NTR voted the greatest Indian actor in 100 years in CNN-IBN poll. He captured 53% of the total votes as the greatest actor while Kamal Hassan received 44%. Malayalam stalwart Mohanlal and Kannada legend Dr Rajkumar got 1% each, rest people on the list failed to gather even 1% of the total votes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X