బెస్ట్ ఆఫ్ లక్!ఎన్టీఆర్

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...వినయ్ డైరక్షన్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా చెప్పింది చేసుకుంటే పోతే చాలనీ, నిర్మాత ఎలాగయినా హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ సమకూరుస్తున్నారని మొచ్చుకున్నాడు.వినాయిక్ మాట్లాడుతూ ఇది తనకు ఎన్టీఆర్ తో డెఫినెట్ గా హ్యాట్రిక్ హిట్ అవుతుందనీ వివరించాడు.
నిర్మాత వంశీ మోహన్ మాట్లాడుతూ...ఈ రోజు మొదలైన షెడ్యూల్ నవంబర్ 13 వరకూ కొనసాగుతుందనన్నారు. అలాగే 28 వ తేదీ వరకూ హీరో బాల్యానికి సంభందించిన ఎపిసోడ్స్ తీస్తామనీ, 29 నుంచీ నవంబర్ 4 వరకూ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తామన్నారు. అలాగే నవంబర్ 5 నుంచీ 12 వరకూ రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్న భారీ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలీయానా చేస్తోందనీ,మరో హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోందనీ అన్నారు.


Click it and Unblock the Notifications











