ఎన్టీఆర్ మళ్లీ పుట్టరు:జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ :" ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు. ఉండబోరు. ఆయన మళ్లీ పుట్టరు ." అన్నారు జూ.ఎన్టీఆర్ భావోద్వేగంగా. ఆయన్ను మీ ఇంట బాబు పుట్టాడుగా... మళ్లీ మీ తాతగారే పుట్టారనుకుంటున్నారా అంటే వెంటనే ఇలా స్పందించారు. తాతపై తనకున్న అంచంచలమైన అభిమానాన్ని మీడియా సాక్షిగా మరో సారి ఇలా వ్యక్తపరిచారు.
ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం 10:58కి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా పలువురు చిత్ర రంగ ప్రముఖులు ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు నాలుగేళ్లుగా ట్విట్టర్ ఖాతాకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ తనకు కుమారుడు జన్మించినట్లు అందులో సందేశాన్ని రాసారు.

చివరిసారిగా 14 డిసెంబర్ 2010లో ట్వీట్ చేసిన ఆయన ఇన్నాళ్ల తర్వాత ''చాలా కాలంగా ట్విట్టర్‌కు దూరంగా ఉన్నాను. ఇవాళ ట్వీట్ చేయాలని అనిపించింది. మాకు పండంటి బాబు పుట్టాడు. మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. లవ్ యు ఆల్'' అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఇక ఆయన అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











