త్రిషతో తొలిసారిగా ఎన్టీఆర్ ఆటా..పాట
ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న'బృందావనం' చిత్రంలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి రెండు మూడు సార్లు వీరు కాంబినేషన్ కోసం అనుకున్నా కుదరలేదు. కానీ వంశి పైడిపల్లి పట్టుపట్టి ఈ కాంబినేషన్ సెట్ చేసారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. శ్రీహరి, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తారు.గోవిందుడు అందరివాడేలే... అనేది ట్యాగ్ లైన్ గా ఈ చిత్రానికి పెట్టారు. అలాగే వచ్చే నెల సెకెండ్ వీక్ లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.ఇక ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. తమన్ ఇంతకుముందు రవితేజ కిక్, ఆంజనేయులు, కళ్యాణ్ రామ్ జయీభవ చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే కెమెరా ఛోటా కె.నాయుడు అందించనున్నారు.ఇక వంశి పైడిపల్లి రెండో చిత్రం ఇది. ఇంతకుముందు ప్రభాస్ తో మున్నా చిత్రాన్ని తీసారు. కానీ ఆ చిత్రం భాక్సా పీస్ వద్ద బావురుమంది.అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం అదుర్స్ చిత్రంలో చేస్తున్నారు. త్రిష..శ్రీను వైట్ల దర్శకత్వంలో నమో వెంకటేశ చిత్రంలో నటిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫిలిం శంఖం భాక్సాపీస్ వద్ద మ్రోగలేదు. ఇక దిల్ రాజు..లేటెస్ట్ జోష్ చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











