ఎన్టీఆర్ మాటకి గోపీచంద్ మొహం మాడిపోయింది
మొగుడు ఆడియో పంక్షన్ కి హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ...'మొగుడు' సినిమా తన 'రాఖీ' అంత గొప్ప సినిమా కావాలని అన్నాడు. అది విన్న స్టేజిపై ఉన్నవారంతా కంగారుపడ్డారు. ఎందుకంటే రాఖీ సినిమా పెద్దాగా ఆడలేదన్న సంగతి తెలిసిందే.దాంతో ఇదేంటిది ఇలా రాఖీతో పోలుస్తున్నాడని అందరి ముఖాలు వెలాతెలా పోయాయి. అలాగే.. "కృష్ణవంశీ తీసిన 'రాఖీ'లో గొప్ప పాత్ర చేశా. ఇప్పటిదాకా ఎన్ని పాత్రలు చేసినా, ఇకముందు ఎన్ని పాత్రలు చేసినా 'రాఖీ' పాత్రని మర్చిపోలేను. కథచెప్పి నన్ను ఏడిపించిన ఏకైక దర్శకుడు వంశీనే.
నాకు 'రాఖీ' మాదిరిగానే నా మిత్రుడైన గోపీకి ఇది బ్రహ్మాండమైన సినిమా అవుతుంది" అన్నాడు. అప్పట్లో రాఖీ చిత్రకం ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయింది. ఆ సినిమాని గుర్తు చేస్తూ.. గోపీచంద్‌కి 'మొగుడు' తన 'రాఖీ' అంత సినిమా కావాలని ఎన్టీఆర్ కోరుకోవడం చూసి, "ఆ సినిమాలాగానే 'మొగుడు' కూడా ఫట్టవ్వాలని ఎన్టీఆర్ కోరుకుకుంటున్నాడా?" అనే మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఆ మాట అంటున్నప్పుడు గోపీచంద్ మొఖం కూడా మాడిపోవటం చూసి గోపిచంద్ కి ఆ మాటలు నచ్చలేదని అర్దమైంది.


Click it and Unblock the Notifications











