For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR Insta Take over RRR: రాజమౌళి కొడుకుతో రామ్ చరణ్ గొడవ.. సీక్రెట్ వీడియో లీక్ చేసిన ఎన్టీఆర్

  |

  తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఒకవైపు.. తమదైన శైలి నటనతో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోలు మరోవైపు.. సినిమానే ప్యాషన్‌గా చేసుకుని దాని కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతోన్న నిర్మాత ఇంకోవైపు.. వీళ్లతో పాటు ఎందరో మరెందరో సినీ ప్రముఖులు.. వీళ్లంతా కలిసి చేస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం).

  'బాహుబలి'తో తెలుగు సినిమాను అందనంత దూరానికి తీసుకెళ్లిన రాజమౌళి.. దాని తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి తీస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అలాంటి ఈ ఫిల్మ్ నుంచి సరికొత్త పద్దతిలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తారక్ ఓ సీక్రెట్ వీడియోను లీక్ చేశాడు. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన యాంకర్ మంజూష: అదిరిపోయే ఫోజులతో ఘాటు ఘాటు ఫోజులు

  రియల్ హీరోల కథతో వస్తున్న చిత్రం

  రియల్ హీరోల కథతో వస్తున్న చిత్రం

  తెలుగు రాష్ట్రాల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి.. వీర మరణం పొందిన తెలుగు వాళ్లు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ఇందులో హీరోయిన్లు. ఈ చిత్రంలో తారక్.. భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు శ్రీయ శరణ్, అజయ్ దేవగణ్, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

  SR Kalyanamandapam 3Days Collections: ఆ హీరోల రేంజ్‌లో వసూళ్లు.. కేవలం 3 రోజుల్లోనే అన్ని కోట్లా!

  చివరి దశకు షూటింగ్... అక్కడికెళ్లి

  చివరి దశకు షూటింగ్... అక్కడికెళ్లి

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం వరుస ఆటంకాలు ఎదురవడమే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఈ మధ్యనే చాలా వరకూ పూర్తి చేశారు. ఇక, ఇప్పుడు రెండు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ఇందులో ఒకదాని కోసం ఇటీవలే చిత్ర యూనిట్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లింది. అక్కడ షూట్‌ను కంప్లీట్ చేసుకున్న తర్వాత మరో దానిని హైదరాబాద్‌లో చిత్రీకరించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  రిలీజ్ డేట్ అదే.. ప్రమోషన్స్ స్టార్ట్స్

  రిలీజ్ డేట్ అదే.. ప్రమోషన్స్ స్టార్ట్స్

  భారీ బడ్జెట్, హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో రాబోతున్న RRR మూవీ 2020లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే, ప్రమోషన్ కూడా ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

  HBDMaheshBabu: మహేశ్ వల్లే బతికిన ఆ వేయి మంది.. సూపర్ స్టార్ గురించి తెలియని నిజాలివే!

  సరికొత్త ప్రయోగం.. హీరోలతో ఇలా

  సరికొత్త ప్రయోగం.. హీరోలతో ఇలా

  RRR మూవీ దాదాపు పది భాషల్లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడు జక్కన్న. ఇందులో భాగంగానే ఆగస్టు 9 నుంచి సినిమాకు సంబంధించిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తారక్ చేతిలో పెడుతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కొన్ని రోజుల తర్వాత ఈ బాధ్యతను రామ్ చరణ్ కూడా అప్పగించబోతున్నారు. ఇలా వాళ్ల వాళ్ల పర్సనల్ అకౌంట్స్‌తో పాటు సినిమా ఖాతాను కూడా హ్యాండిల్ చేయబోతున్నారు.

  షూటింగ్ స్పాట్‌లోని వీడియో షేర్

  షూటింగ్ స్పాట్‌లోని వీడియో షేర్

  NTRInstaTakeoveRRR అనే ట్యాగ్‌తో నేటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పోస్టులు పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో రామ్ చరణ్, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి కుమారుడు) ఓ రూమ్‌లో కూర్చుని మాట్లాడుతుంటారు. అప్పుడు కెమెరా ఆన్ చేసుకుని వెళ్లిన తారక్.. రామ్ చరణ్‌తో ముచ్చటిస్తాడు. ఇందులో వాళ్ల మధ్య ఆసక్తికరమై సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  కార్తికేయతో రామ్ చరణ్ గొడవతో

  కార్తికేయతో రామ్ చరణ్ గొడవతో

  జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ వీడియోలో రామ్ చరణ్.. ఎస్ఎస్ కార్తికేయతో ఫన్నీగా గొడవ పడతాడు. ముందుగా లోపలికి వెళ్లిన నందమూరి హీరో ‘చరణ్.. డ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం పూర్తైందా' అని ప్రశ్నిస్తాడు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ ముందర ఉన్న టేబుల్‌పై వాయించి హా అయిపోయింది తారక్ అని బదులిస్తాడు. ఆ తర్వాత ‘కాట్ (కార్తికేయ) రియల్ డ్రమ్స్ ఎక్కడ? కాస్ట్యూమ్స్ ఎక్కడ? షూట్ ఉందని పొద్దు పొద్దునే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎప్పుడు తెస్తారు' అని ఫైర్ అవుతాడు. అప్పుడు కార్తికేయ రెండు నిమిషాలు ఆగమని సర్ధి చెబుతుంటాడు.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu

  రిలీజ్‌ డేట్‌ను సస్పెన్స్‌గా ఉంచేలా

  ఇక, ఈ వీడియోలో కార్తికేయను ప్రశ్నించిన రామ్ చరణ్ ‘అసలు సినిమాను దసరాకు రిలీజ్' అని ఏదో అంటుంటాడు. సరిగ్గా అప్పుడే దీన్ని ఆపేస్తారు. కావాలనే రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ ఉంచేందుకే ఇలా ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో రూపంలో ఇందులో నటిస్తున్న ఇరువురు హీరోల ఫ్యాన్స్‌కు మజా వచ్చిందనే చెప్పాలి. అందుకే దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది.

  English summary
  Tollywood Most Anticipated Movie RRR. Recently This Movie Unit Started Promotion with NTRInstaTakeoveRRR Tag. Now Jr NTR Shared Ram Charan and Karthikeya Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X