twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇఫీ బట్టలిప్పేస్తున్న ఎస్ దుర్గ, న్యూడ్.. ప్రారంభానికి ముందే రచ్చ రచ్చ.. రాజీనామాలు..

    By Rajababu
    |

    Recommended Video

    రచ్చ రచ్చ అవుతున్న ఎస్ దుర్గ, న్యూడ్

    ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శించే చిత్రాల నుంచి మలయాళ చిత్రం ఎస్ దుర్గ, మరాఠీ చిత్రం న్యూడ్‌ను తొలగించడంపై జ్యూరీ సభ్యులు భగ్గుమంటున్నారు. తాము ఎంపిక చేసిన చిత్రాలను కేంద్ర సమాచారశాఖ తొలగించడాన్ని నిరసిస్తూ జ్యూరీ సభ్యులు సుజోయ్ ఘోష్, గ్యాన్ కొర్రియా, అపూర్వ అస్రానీ తమ పదవులకు రాజీనామా చేశారు. నవంబర్ 20 తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ దుర్గ, న్యూడ్ చిత్రాలను తొలగించడంపై జ్యూరీ సభ్యులు ఈ విధంగా స్పందించారు.

    ఎస్ దుర్గ, న్యూడ్ అవుట్

    ఎస్ దుర్గ, న్యూడ్ అవుట్

    ఇఫీలో మంచి చిత్రాలను ప్రదర్శించాలన్న లక్ష్యంతో తాము కొన్ని సినిమాలను ఎంపిక చేశాం. అయితే వాటిలో నుంచి కొన్నింటిని తొలగించడం మాకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో జ్యూరీ చైర్మన్‌ అండగా ఉంటాం. మా నిర్ణయాన్ని తప్పుపట్టిన నేపథ్యంలో గోవా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి మా మనసు అంగీకరించడం లేదు. మేము ఎంపిక చిత్రాలకు మంచి పేరు రావాలని కోరుకొంటున్నాం. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మేము అంకితభావంతో సినిమాలను ఎంపిక చేశాం అని అస్రానీ అన్నారు.

    సుజోయ్ ఘోష్ స్పందన

    సుజోయ్ ఘోష్ స్పందన

    ఎస్ దుర్గ, న్యూడ్ చిత్రాలను ఇఫీ నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన జ్యూరీ చైర్మన్ సుజోయ్ ఘోష్ స్పందించారు. తాము ఎంపిక చేసిన చిత్రాలను తొలగించింది నిజమే. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడి దీనిని వివాదం చేయదలచుకోలేదు అని ఆయన అన్నారు.

    కేంద్ర నిర్ణయం దురదృష్టకరం

    కేంద్ర నిర్ణయం దురదృష్టకరం

    కేంద్ర సమాచార శాఖ నిర్ణయంపై పలువరు జ్యూరీ సభ్యులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలా దురదృష్ణకరం, అత్యంత విషాదకరమైంది. ఎస్ దుర్గ, న్యూడ్ సినిమాలను తాము అందజేసిన జాబితా నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు.

    కేరళ హైకోర్టులో పిటిషన్

    కేరళ హైకోర్టులో పిటిషన్

    ఇదిలా ఉండగా, కేంద్ర సమాచార శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో ఎస్ దుర్గ డైరెక్టర్ సనన్ కుమార్ శశిధరన్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలను కేంద్ర మంత్రిత్వశాఖ అనుసరించాలి. కానీ అలా చేయడం లేదు. తన స్వంత నిర్ణయాలను జ్యూరీ కమిటీపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నది అని సనన్ కుమార్ అన్నారు. తొలగించిన చిత్రాలను వెంటనే జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

    మరాఠీ దర్శకుల ఆగ్రహం

    మరాఠీ దర్శకుల ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మరాఠీ సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ దర్శకుడు ఉమేష్ కులకర్ణి అసహనాన్ని వ్యక్తం చేశారు. పనోరమా సెక్షన్ నుంచి జాతీయ పురస్కార చిత్రం కాసవ్ ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కాసవ్ చిత్రానికి రాష్ట్రపతి మెడల్ అందుకొన్న దర్శకురాలు సుమిత్ర భావేను ఇఫీలో పాలొ్గన వద్దని ఆయన సూచించారు.

    English summary
    After Sujoy Ghosh resigned as the head of the jury of IFFI’s Panorama section to protest exclusion of the two films, two more members have quit. Apoorva Asrani says his conscience “won’t allow” him to participate in the festivities in Goa. Many of film personalities wanted the ministry to implement the jury’s decision and include films in the final list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X