'రంగ్ రసయ్యా' పేరుతో కేతన్ మెహతా రూపొందిస్తున్న తాజా చిత్రంలో ఓ పూర్తి స్ధాయి న్యూడ్ సీన్ ఉంది. అయితే అది సెన్సార్ గుమ్మం దాటదేమోనని అంతా భయపడ్డారు. అయితే వారంతా ఊహించని విధంగా సెన్సార్ వారు అస్సలు అభ్యంతరాలు దానికి ఓకె చెప్పేసారు. ప్రసిద్ద భారతీయ చిత్రకారుడు రాజా రవి వర్మ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రంలో ఆ సన్నివేశం అవసరమేనని వారు భావించారని తెలుస్తోంది. ఇక రణదీప్ హూండా మరియు నందనా సేన్ జంటగా చేస్తున్న ఈ చిత్రంలో నందనాపై ఆ న్యూడ్ సీన్ తీసారు. సిగ్గుపడకుండా న్యూడ్ సీన్ ఒప్పుకుని చేసినందకు సెన్సార్ కత్తెర పడటం ఆమెకు ఆనందాన్ని కలుగ చేస్తోందని అంటోంది.ఇక ఆ సీన్ లో ఆమె రవివర్మ గీసే చిత్రానికి ఆమె నగ్నగా కూర్చుని మోడలింగ్ చేస్తుంది.ఇక సెన్సార్ వారు దీని గురించి మాట్లాడుతూ అందులో నగ్నత్వం చూపిన అసభ్యత లేకపోవటం మా కత్తెరలను కట్టిపడేసిందంటున్నారు.