పూరీ న్యూడ్ సీన్ వివాదం

By Staff

Kangana
పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఏక్ నిరంజన్ చిత్రంలో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ కొన్ని రూమర్స్ ముంబయి టాబ్లాయిడ్స్ లో వచ్చాయి. అవి రావటానికి కారణం కంగనారౌనత్. ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఈ ముంబయి భామ చేయటమే ఈ రూమర్స్ పుట్టకకు కారణమైంది. ఈ మధ్య షూటింగ్ గ్యాప్ లో ముంబయి వెళ్ళిన ఆమెను అక్కడ మీడియా ఆ విషయం ప్రశ్నించింది.

దానికి ఆమె తాను అటువంటి సీన్స్ చేయటం లేదంటూ,ఆ రూమర్స్ ఎలా పుట్టించారంటూ ఎదురు ప్రశ్నించింది. అంతేగాక న్యూడ్ సీన్..నేను నా లైఫ్ లో ఎప్పుడూ చేయను.ఆఖరికి నా తలపై తుపాకి గురిపెట్టినా కమిట్ కాను అంది. అటువంటి సన్నివేశాల్లో నటిస్తే నా సంప్రదాయకమైన కుటుంబానికి ఎంత మచ్చ. అలాగే నా కుటుంబసభ్యులుకా విషయాలు తెలిస్తే వెంటనే మా నేటివ్ హిమాచల్ ప్రదేశ్ కి తీసుకెళ్ళిపోతారు. అలాగే నా కిచ్చే చెక్ లో ఒకటి ప్రక్కన వరసగా ఎన్ని సున్నాలు పెట్టినా కూడా ఒప్పుకోను. నాకు నేనే ఓ సెన్సార్ కోడ్ పెట్టుకున్నాను అంది..

ఇక ఈ విషయమై నా డైరక్టర్ పూరీ జగన్నాధ్ ని ఎక్కడెక్కడి జర్నిలిస్టులు ఫోన్ చేసి అడిగారు.ఆయన చాలా ఫీలయ్యారు. పూరీ ఓ రెస్పక్టెడ్ ఫిల్మ్ మేకర్ అని పొగిడింది. అయినా రాజ్-2 సమయంలో కూడా న్యూడ్ సీన్ ఉందని హైప్ చేసారు అప్పుడు కూడా బాత్ టబ్ లో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన డ్రస్ వేసుకున్నాను. అయినా నా బట్టలన్నీ విప్పతీస్తానని ఎలా ఊహిస్తున్నారు.ప్రస్తుతం కంగనా ముంబయి వచ్చింది..ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి అనే చిత్రంలో పాత్ర మేకప్ టెస్ట్ కోసం. అదీ కంగనూ న్యూడ్ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X