Don't Miss!
- News
Hyderabad: సంతకాలు ఫోర్జరీ కేసులో సినీ నటుడు అరెస్ట్..
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నగ్న వీడియోను షేర్ చేసిన అమలా పాల్.. ఈ సీన్ చూసిన తర్వాత..
Recommended Video
అమలా పాల్.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం తాజాగా అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కనిపించింది. దీంతో 'అడై'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 'అడై' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మిశ్రమ స్పందన
రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, తమ టార్గెట్ అయిన యువతకు సినిమా బాగా రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

విమర్శకుల ప్రశంసలు
ఈ సినిమాను నగ్నత్వంతో కాకుండా మెచ్యూరిటీతో చూడాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. ఇందులో అమలా పాల్ చేసిన ధైర్యాన్ని పలువురు సినీ విమర్శకులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం చెడు దారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అవసరమైన మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చారని ప్రశంసిస్తున్నారు.
|
న్యూడ్ వీడియో వదిలింది
అమలా పాల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ‘అడై' సినిమాలోని న్యూస్ సీన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె నగ్నంగా కనిపిస్తోంది. ఓ పగిలిపోయిన అద్దాన్ని తన శరీరానికి అడ్డుగా పెట్టుకుని ఉంటుంది. ఈ వీడియో షేర్ చేసిన అమలా పాల్ ‘‘ఇది చూసిన వారు పత్రికల్లో న్యూడిటీ అని రాయవచ్చు.. కానీ, ఈ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఆసక్తిగా అనిపించింది'' అంటూ క్యాప్షన్ పెట్టింది.

ప్రమోషన్ కోసం సరికొత్తగా..
ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ మరింత మంది ప్రేక్షకులను సినిమా థియేటర్ల వైపునకు తీసుకు వచ్చేందుకు అమలా పాల్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వీడియో వదలడం అని పలువురు అంటున్నారు. ప్రమోషన్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అడై గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.