For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు: అర్ధరాత్రి ఆ విషయంలో మొదలైన గొడవ.. సీసీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  |

  మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, ప్రముఖ నటి నిహారిక కొణిదెల.. ఓ పోలీస్ బాస్ కుమారుడైన జొన్నలగడ్డ చైతన్యను గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తమ వైవాహిక జీవితాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. తరచూ హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం.. పార్టీలు చేసుకోవడం.. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం వంటివి చేస్తున్నారు.

  ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంటకు భారీ షాక్ తగిలింది. నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ కేసు నమోదైంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సినీ పరిశ్రమతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ విపరీతంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు చైతన్యపై పోలీస్ కేసు ఎందుకు నమోదైంది? పూర్తి వివరాలు మీకోసం!

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు

  నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కేసు

  మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త జొన్నలగడ్డ చైతన్యపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లోని కొందరు వ్యక్తులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  అర్ధరాత్రి సమయంలోనూ వాళ్ల ఫ్లాట్‌లోకి ఎవరో ఒకరు వస్తున్నారని, తరచూ మద్యం సేవించి నానా హంగామా చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రతిరోజూ ఇదే తరహాలో న్యూసెన్స్ చేస్తున్నారని కూడా కంప్లైట్ చేశారట. ఇందులో నిహారిక భర్తపైనే ఆరోపణలు చేశారని సమాచారం.

  బాలకృష్ణ నిజస్వరూపం బయటపెట్టిన ప్రదీప్: అవసరానికి ఫోన్ చేస్తే అలా.. సీక్రెట్ లీక్ చేసిన యాంకర్

  పోలీసులను ఆశ్రయించిన చైతన్య

  పోలీసులను ఆశ్రయించిన చైతన్య

  జొన్నలగడ్డ చైతన్యపై అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే అతడు కూడా ప్రత్యర్ధి వర్గంపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. నిహారిక భర్త చేసిన ఫిర్యాదులో అపార్ట్‌మెంట్‌లోని కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేశారని.. ఈ క్రమంలోనే తాను, తన స్నేహితులపై దాడి చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నట్లు సమచారం. అతడు కూడా తనపై కేసు నమోదైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశాడని తెలిసింది. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  ఆరోజు జరిగిన ఘటన.. సీక్రెట్‌గానే

  ఆరోజు జరిగిన ఘటన.. సీక్రెట్‌గానే

  నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కేసుకు సంబంధించిన వ్యవహారం మంగళవారం అర్ధరాత్రి జరిగినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అప్పుడే ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించాయని.. వెంటనే ఎఫ్‌ఐఆర్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని అటు మెగా ఫ్యామిలీ, ఇటు అపార్ట్‌మెంట్ వాసులు గోప్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. ఇక, ఇప్పుడు మాత్రం ఇది భారీ స్థాయిలో వైరల్ అవుతోంది.

  దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు

  దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు

  జొన్నలగడ్డ చైతన్యపై అపార్ట్‌మెంట్ వాసులు కేసు పెట్టడం.. ఆ తర్వాత అతడు కూడా వాళ్లపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై దర్యాప్తును వెంటనే ప్రారంభించారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని మిగిలిన వాళ్లను విచారించినట్లు సమాచారం. అసలు గొడవ ఎందుకు జరిగింది? ఏ సమయంలో జరిగింది? గొడవ జరిగినప్పుడు ఎవరు ఏ స్థితిలో (మద్యం సేవించారా లేదా) ఉన్నారు? అనే విషయాలను వాళ్లను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది.

   సీసీ టీవీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  సీసీ టీవీ పుటేజ్‌లో కీలక ఆధారాలు

  తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ గొడవకు సంబంధించిన విచారణ జరుపుతోన్న సమయంలో పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారట. అందులో అపార్ట్‌మెంట్ వాసులకు, జొన్నలగడ్డ చైతన్యకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన విజువల్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. వాటి ఆధారంగా ఈ కేసుల చిక్కుముడి వీడే ఆస్కారం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు సీసీ పుటేజ్‌లో ఏ ఆధారాలు ఉన్నాయన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

  వాళ్లంతా సైలెంట్‌గానే... చెబుతారా?

  వాళ్లంతా సైలెంట్‌గానే... చెబుతారా?

  మెగా అల్లుడు జొన్నలగొడ్డ చైతన్యపై పోలీస్ కేసు నమోదైందన్న న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వార్త అన్నింట్లోనూ బ్రేకింగ్ అయిపోయింది. అయినప్పటికీ ఈ కేసులపై చైతన్య కానీ, నిహారిక కానీ స్పందించలేదు. అదే సమయంలో అతడిపై కేసు పెట్టారని చెబుతున్న అపార్ట్‌మెంట్ వాసులు కూడా దీనిపై నోరు మెదపడం లేదు. మరోవైపు.. ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి కూడా సమాచారం అందడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరైనా దీనిపై స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  బయటకు వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు

  బయటకు వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు

  ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలాగే, అటు అపార్ట్‌మెంట్ వాసులు, ఇటు జొన్నలగడ్డ చైతన్య ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన కాపీల ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్ అవుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ కేసు వ్యవహారంపై మెగా ఫ్యామిలీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Nuisance Case Filed Mega Daughter Nikarika Konidela Husband Chaitanya Jonnalagadda. Then His Also Gave Complaint at Banjara Hills Police Station.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X