విజయ్ దేవరకొండ క్షమాపణ.. అలా హద్దు మీరడం తప్పు.. నే చూసుకొంటా!

Recommended Video

Vijay Devarakonda Said Sorry To Hyderabad Traffic Police | Filmibeat Telugu

విజయ్ దేవరకొండ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశం పంపారు. మీరంతా నా ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఒక సలహా ఇస్తున్నాను. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, నేను కూడా వాటిని ఫాలో అవుతాను. ఆ రూల్స్ ఉన్నవి మన మంచి కోసమే అంటూ ఓ విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

కొందరు కుర్రాళ్లు వాహనాల నెంబర్ ప్లేట్స్ మీద... నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ లేకుండా విజయ్ దేవరకొండ బ్రాండ్ 'రౌడీ' అని రాసుకుని తిరుగుతుండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ చేశారు. ఇది విజయ్ దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు.

వాహనాల నెంబర్ ప్లేట్స్ విషయంలో నిబంధనలు పాటించండి.

వాహనాల నెంబర్ ప్లేట్స్ విషయంలో నిబంధనలు పాటించండి.

మీకు మీ ఫ్యామిలీ మీద లేదా స్నేహితుల మీద, దేవుడి మీద ప్రేమ ఉంటే... దాన్ని మీ బైక్స్ మీద ఇతర ఏ భాగంలో అయినా చూపించుకోండి. అయితే నెంబర్ ప్లేట్ మాత్రం కేవలం నెంబర్స్ కోసమే ఉపయోగించండి అని సూచించారు.

క్షమాపణలు చెప్పిన విజయ్ దేవరకొండ

క్షమాపణలు చెప్పిన విజయ్ దేవరకొండ

తన మీద అభిమానంతో నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో వారి తరుపున తాను క్షమాపణలు చెబుతున్నట్లు విజయ్ తెలిపారు. వెంటనే వారిలో ఈ విషయంలో చైతన్యం తెస్తానంటూ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన పోస్టుకు రిప్లై ఇచ్చారు.

నెంబర్ ప్లేట్

నెంబర్ ప్లేట్

అందరూ తప్పకుండా నెంబర్ ప్లేట్స్ విషయంలో నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా తన అభిమానులకు విజయ్ సూచించారు. మరి విజయ్ సూచనతో ఫ్యాన్స్ సరైన మార్గంలో నడుస్తారని, ఈ నిబంధనలు పాటిద్దామని ఆశిద్దాం.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్' మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మార్చి 17న టీజర్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి ఈ టీజర్ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X