పవన్ ఫ్యాన్స్ కళ్లలో అది చూస్తాం.. త్రివిక్రమ్ కోసం కాదు.. పరాన్నజీవిపై నూతన్ నాయుడు

పరాన్నజీవి సినిమా గురించి నూతన్ నాయుడు ప్రముఖ టెలివిజన్ చానెల్‌లో మాట్లాడారు. తన సినిమా గురించి నూతన్ న్యాయుడు చెబుతూ.. నేను తీసే పరాన్నజీవి చిత్రంలో రాధా గోపాల్ వర్మ క్యారెక్టర్ చేసిన పనులు, ఆయన జీవితం, అనుసరించిన విధానాలను చక్కగా తెరకెక్కించబోతున్నాం. రాధా గోపాల్ వర్మ క్యారెక్టర్‌కు సంబంధించిన ప్రేక్షకులను విశేషంగా మెప్పించే అంశాలు ఉన్నాయి. మంచి నటీనటుల కలయికతో పరాన్నజీవి తీసాం. ప్రేక్షకుడికి పెట్టే ప్రతీపైసాకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను అని నూతన్ నాయుడు అన్నారు.

పవన్, త్రివిక్రమ్ కోసం సినిమా తీయడం లేదు

పవన్, త్రివిక్రమ్ కోసం సినిమా తీయడం లేదు

పవన్ కల్యాణ్‌ ప్రాపకం కోసం, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధం కారణంగా పరాన్నజీవి తీయడం లేదు. వారి ప్రాపకం కోసం సినిమా తీసి ఇంప్రెస్ చేయలేం. మా సినిమాకు పవన్, త్రివిక్రమ్ ప్రోత్సాహం లేదు. నా బలం, బలగం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, కేవలం వారిని తృప్తి పరచడానికి మాత్రమే పరాన్నజీవి సినిమా తీస్తున్నా. నూటికి నూరు శాతం పవన్ కల్యాణ్ అభిమానుల కళ్లల్లో తృప్తి, సంతృప్తిని చూడటానికి ఈ సినిమాను చేస్తున్నాం అని నూతన్ నాయుడు అన్నారు.

ఫ్యాన్స్‌లో ఆనందం, బ్రహ్మానందం

ఫ్యాన్స్‌లో ఆనందం, బ్రహ్మానందం

పరాన్నజీవి సినిమా చూసిన తర్వాత పవన్ కల్యాణ్ అభిమానుల్లో తృప్తి, సంతృప్తి మాత్రమే కాదు. ఆనందం, బ్రహ్మానందం చూస్తారు. తప్పకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు తృప్తిని కలిగిస్తుంది. పరాన్నజీవి చిత్రం కేవలం పవన్ అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. అలా మేము కంటెంట్ తయారు చేశాం. మంచి పాటలు పెట్టాం. మంచి డైలాగ్స్ పెట్టాం అని నూతన్ నాయుడు తెలిపారు.

వర్మ మానసిక దాడి చేస్తూ

వర్మ మానసిక దాడి చేస్తూ

ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగని ఒకరి మీద మరొకరు శారీరక దాడి, మానసిక దాడి చేసినా అది తప్పే. ఎంతో అనుభవం ఉన్న రాంగోపాల్ వర్మ ఎంత మందిపై మానసిక దాడి చేస్తున్నారో అందరికీ తెలుసు. కొందరి వ్యక్తిగత జీవితాలపై సినిమాలు తీస్తున్నారు. కొన్ని తేడాలతో కొందరిని టార్గెట్ చేస్తున్నారు. అందుకే మేము ఆయనలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే పరాన్నజీవి అని నూతన్ నాయుడు పేర్కొన్నారు.

పరాన్నజీవితో ఆర్జీవిలో మార్పు

పరాన్నజీవితో ఆర్జీవిలో మార్పు

పరాన్నజీవి సినిమా ఆరంభంతో రాంగోపాల్ వర్మలో మార్పు వచ్చింది. ఇంకా మార్పు రాబోతున్నది. ఆయన తన సినిమా క్లైమాక్స్‌ను మార్చేస్తున్నారు. ఇప్పటికే డైలాగ్స్‌ను మార్చేస్తున్నారు. పవన్ వీరాభిమానిని అని చెప్పుకొంటున్నాడు. పరాన్నజీవితో ఆయనలో మార్పు మొదలైంది అని నూతన్ నాయుడు చెప్పారు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
సినీ ప్రముఖులు సవాళ్లు విసరొద్దు

సినీ ప్రముఖులు సవాళ్లు విసరొద్దు

ఆర్జీవి ఆఫీస్‌పై దాడికి మేము కాదు. ఈ ఘటనకు కారణం ఎవరో అందరికీ తెలుసు. పబ్లిక్ లైఫ్‌లో ఉండే వ్యక్తి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడానికి కారణం ఎవరు? అలా సంఘటనలకు ప్రేరేపించింది, రెచ్చగొట్టింది ఎవరో తెలుసు. వర్మ లాంటి వ్యక్తి విచక్షణ కోల్పోవడం బాధకరం. ఆ విచక్షణను మేల్కొనే విధంగా పరాన్నజీవి పనిచేస్తుంది. మనిషికైతే మాట చెబుతున్నాం. వర్మకు మాటలు చెబితే మారే వ్యక్తి కాదు. అందుకే పరాన్నజీవి సినిమా అని నూతన్ నాయుడు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X