twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా పర్సులన్నీ ఖాళీ చేయండి, కానీ ఆ పని చేయండి.. ట్రాఫిక్ జరిమానాలపై నూతన్ నాయుడు

    |

    సామాజిక కార్యకర్త, బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు నూతన్ నాయుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. దేశభక్తి, సమాజ పరిస్థితులపై లోతుగా స్పందిస్తుంటారు. సామాజిక అంశాలతోపాటు వినోద రంగంలోని విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకొంటారు. తాజాగా విపరీతమైన చర్చ జరుగుతున్న ట్రాఫిక్ నిబంధనలు, చలానాలపై తనదైన శైలిలో స్పందించారు. పరోక్షంగా ప్రభుత్వాలకు చురకలు అంటించారు. ఇటీవల ఆయన చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే...

    కేంద్ర ట్రాఫిక్ చట్టాలపై

    కేంద్ర ట్రాఫిక్ చట్టాలపై

    కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ట్రాఫిక్ చట్టాలపై ఓ వైపు సానుకూల స్పందన వస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయడానికి ససేమిరా అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేయబోమంటూ పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్రానికి ఝలక్ ఇచ్చాయి. ఇలా ట్రాఫిక్ నిబంధనలపై చర్చ జరుగుతుంటే నూతన్ నాయుడు ఆసక్తికరమైన పోస్టు చేశారు.

    ఎంతైనా వసూలు చేయండి కానీ..

    ఎంతైనా వసూలు చేయండి కానీ..

    ట్రాఫిక్ నిబంధనలపై నూతన్ నాయుడు స్పందిస్తూ.. హెల్మెట్ లేకపోతే 2 వేలు కాదు.. 4 వేలు వసూలు చేయండి. మద్యం తాగి వాహనం నడిపితే 10 వేలు కాదు.. పాతిక వేలు జరిమానా విధించండి. రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేస్తే మా పర్సులన్నీ ఖాళీ చేయండి.. వసూలు చేసిన ప్రతీ పైసా రోడ్లు బాగు చేయడానికి ఉపయోగిస్తామని హామీ ఇవ్వండి అంటూ తనదైన శైలిలో నూతన్ నాయుడు స్పందించారు.

     దేశభక్తి గురించి

    దేశభక్తి గురించి

    ఇటీవల దేశభక్తి గురించి నూతన్ నాయుడు చేసిన ఫేస్‌బుక్ పోస్టింగ్ మరింత ఆలోచింపజేసింది. ‘నరనరాన ఇస్లాం భావాలు నిండిన పాకిస్థాన్.. భారత్‌లో లౌకికత్వం లేదని వాపోతున్నది. ప్రతీ ఇంచూ కమ్యునిజం కప్పుకొన్న చైనా.. కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం కొరవడిందని తెగ ఫీలైపోతుంది అని నూతన్ నాయుడు ఘాటుగా స్పందించారు.

    సినిమా రంగంపై ఫోకస్

    సినిమా రంగంపై ఫోకస్

    ఇక సామాజిక కార్యక్రమాలతో పాల్గొంటునే నటనపై నూతన్ నాయుడు దృష్టిపెట్టారు. గతేడాది రిలీజైన F2 మూవీలో ఆయన పోషించిన పాత్ర అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఓ మంచి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. అలాగే బిగ్‌బాస్‌పై ఎప్పటికప్పుడు తనకు తెలిసిన విషయాలను షేర్ చేస్తుంటారు.

    English summary
    Bigg Boss contestant and social worker Nutan Naidu responds on Traffic rules and fines. He said, no bother, If you take wheterver on traffic rules violations. but Government should spend whole amount on roads developments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X