'నువ్వు -నేను' అనితను బికినీలో చూడాలని ఉంటే...
తేజ రూపొందించిన "నువ్వు-నేను" చిత్రం హీరోయిన్ అనిత తోలి చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నా ఆ తర్వాత తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. వరుస ఫెయిల్యూర్స్ రావటంతో దాదాపు అందరు అనితను మరిచిపోయారు కూడా. దాంతో తన రీఎంట్రీ కోసం నానా తిప్పలు పడుతోంది. ఇటీవల నాగ్ నటించిన రగడ చిత్రంలో ఓ అతిధి పాత్రలో తలుక్కున మెరిసింది. అలాగే అంతకుముందు నిఖిల్ హీరోగా వచ్చిన కళావర్ కింగ్ లో ఐటం సాంగ్ కూడా చేసింది. అయినా ఆమెను పట్టించుకున్నవారు లేరు. దాంతో ఇప్పుడామె బికినీ వేయటానికి సిద్దపడింది. అల్లరి నరేష్ హీరోగా వీరభద్రమ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందిన 'అహ నా పెళ్లంట' చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర చేస్తోంది. ఆమె పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ అంటున్నారు దర్శకుడు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సుబ్రమణ్యం అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారు. దర్శకుడు చిత్ర కథ గురించి చెబుతూ... సుబ్రహ్మణ్యం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సంజన అనే ఓ అందమైన భామతో పరిచయం కలుగుతుంది. వీరిద్దరివీ భిన్నధ్రువాలే అయినా మనసులు కలిశాయి. ఇంకేముంది? పెళ్లే తరువాయి అనుకొన్నాడు సుబ్బు. అసలు కథ అక్కడి నుంచి మొదలైంది. సాఫ్ట్‌వేర్ సుబ్రహ్మణ్యం వివాహం వెనక ఉన్న తమాషా సంఘటనల్ని వినోదభరితంగా చూపించబోతున్నాం అన్నారు. నరేష్, రీతూ బర్మీచా జంటగా నటించారు. శ్రీహరి ముఖ్య భూమిక పోషించారు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారుసంగీతం: రఘు కుంచె.


Click it and Unblock the Notifications











