Don't Miss!
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరుణ్ సందేశ్ ‘నువ్వలా..నేనిలా’ (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: 'మేం వయసుకు వచ్చాం' ఫేం త్రినాథరావు దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న క్లాసికల్ లవ్ స్టోరీ 'నువ్వలా..నేనిలా'. వరుణ్ సందేశ్-పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగుతో పాటు పోస్టు ప్రొడక్షన్ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది.
పైసా ఫేం సాయి కార్తీక్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భాస్కరభట్ల, శ్రీమణి, బాలాజీ ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని...ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.
సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు స్లైడ్ షోలో....
దర్శకుడు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ...ఇటీవల కాలంలో తెలుగులో క్లాసిక్ లవ్ స్టోరీస్ రావడం లేదనే లోటును తీర్చే చిత్రం ‘నువ్వలా...నేనిలా'. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయనటువంటి అత్యంత వైవిధ్యవంతమైన క్యారెక్టర్ ఈ చిత్రంలోవరుణ్ చేస్తున్నాడు. హీరోయిన్ పూర్ణ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...
నిర్మాత ఇందూరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...మా దర్శకుడు ‘నువ్వలా...నేనిలా' చిత్రాన్ని అద్భుతంగా తెరరెక్కించారు. వేదం, కృష్ణం వందే జగద్గురుం చిత్రాలకు పని చేసిన జ్ఞానశేఖర్ వి.ఎస్ అందించిన చాయాగ్రహణం, పైసా చిత్రానికి పని చేసిన సాయి కార్తీక్సంగీతం, వరుణ్ సందేశ్-పూర్ణ నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం డిటిఎస్ వర్కు జరుగుతుంది. నెలాఖరున ఆడియోను విడుదల చేస్తాం అన్నారు.
నటీనటులు
సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధనరాజ్, ఉత్తేజ్, అరుణ్ కుమార్, గిరి, అదుర్స్ రఘు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
టెక్నీషియన్స్
ఈ చిత్రానికి ఎడిటర్: శ్రవణ్, ఆర్ట్: వర్మ, మాటలు: ఉదయ్ భాగవతుల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: విష్ణు సూర్య.జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాలకుర్తి శ్రీధర్ గౌడ్, నిర్మాత: ఇందూరి రాజశేఖర్ రెడ్డి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: త్రినాథనారావు.