కెరీర్ - ప్రేమ ('నువ్వే నా బంగారం' ప్రివ్యూ)
హైదరాబాద్: రోజుకో కొత్త సినిమా,కొత్త హీరోలను వెంటేసుకుని దిగుతోంది. స్టఫ్ ఉన్న సినిమాలు ఉయ్యాల జంపాల తరహాలో హిట్టవుతున్నాయి. లేనివి వచ్చే వారం కూడా చూడటం లేదు. మీడియం బడ్జెట్ లో తయరయ్యే ఈ చిత్రాలు ఓపినింగ్స్ సైతం రాబట్టడం కష్టంగా ఉంటాయి. అయితే టాక్ వస్తే మాట్నీకే హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ నువ్వే నా బంగారం చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.
సూర్య (సాయికృష్ణ) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి. తన కాళ్లమీద తాను నిలబడాలనుకొనే మనస్తత్వం కలవాడు. స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టం. అందుకే ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటాడు. హారిక (షీనా) ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అమ్మానాన్న అంటే గౌరవం. 'మీరు చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకొంటా' అని ఇంట్లోవాళ్లకు మాటిస్తుంది. కానీ అనుకోకుండా సూర్య, హారిక ప్రేమలో పడతారు. ఆ తరవాత ఏమైంది? సూర్య, హారిక ఇద్దరూ తల్లిదండ్రుల మాట తప్పారా? స్వేచ్ఛను దుర్వినియోగం చేశారా? అనేది తెరపై చూడాలి.

దర్శకుడు రామ్ వెంకీ మాట్లాడుతూ... ''యువతరం రెండు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రేమని, కెరీర్‌ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. జీవితం బాగుండాలంటే రెండూ లైట్ తీసుకోకుండా ముందుకు సాగాలి. అదే సమయంలో తల్లిదండ్రులకు పిల్లలపై నమ్మకం ఉండాలి. ఈ చిత్రంలో ఈ విషయాన్నే చెబుతున్నాం. తల్లిదండ్రులకు పిల్లలు బంగారంలానే కనిపిస్తారు. పిల్లలకూ వాళ్ల తల్లిదండ్రులు బంగారమే. అందుకే ఈ టైటిల్ పెట్టాం. యాజమాన్య అందించిన బాణీలు ఆకట్టుకొంటాయి. ప్రతిపాటా కథని నడిపించేదే. 60 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. మయూరి ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.
నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ "యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని నిర్మించాం. యాజమాన్య అందించిన సంగీతం సినిమాకి పెద్ద ప్లస్. ఇప్పటికే ఆడియో హిట్టయింది. తప్పకుండా చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది'' అని చెప్పారు. పెద్ద హీరోలు చేయాల్సిన ఒక మంచి కథతో మొదటి సినిమానే చేసినందుకు ఆనందంగా ఉందని హీరో సాయికృష్ణ తెలిపారు.
సంస్థ: శ్రీధనలక్ష్మి మూవీస్
నటీనటులు: సాయికృష్ణ, షీనా, నిషాకొఠారి, సుమన్, తనికెళ్ల భరణి, సన, రాజశ్రీ నాయర్, ప్రవీణ్, శ్రావణ్, మహేశ్వరి తదితరులు.
కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్,
ఛాయాగ్రహణం: రామ్.
సంగీతం: యాజమాన్య
నిర్మాత: పేరిచర్ల కృష్ణంరాజు
దర్శకత్వం: రామ్ వెంకీ
విడుదల: 07,మార్చి 2014.


Click it and Unblock the Notifications











