‘నువ్విలా’ హీరో మరో కొత్త చిత్రం
సురేష్ గున్న దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రంలో కౌసల్య హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ...'ఓ భిన్నమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో నేటి యువతరానికి వచ్చే అన్ని అంశాలుంటాయి. కాలేజీ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రంలో అన్ని వర్గాల వారు మెచ్చే అంశాలున్నాయి. తప్పకుండా ఈ వైవిధ్యమైన ప్రేమకథ ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
అజయ్, కౌసల్య, అర్జున్ చెల్లూరి, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : మార్తాండ్.కె.వెంకటష్, కెమెరా : సాయి శ్రీరామ్, సహ నిర్మాతలు : శీలం లక్ష్మణ్, విల్లూరి భాస్కర్, నిర్మాణ, నిర్వహణ : రామాచారి మారోజు, సమర్పణ : వంశీకృష్ణ శ్రీనివాస్, నిర్మాత : చొక్కాకుల వెంకట్రావ్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సురేష్ గున్నం.


Click it and Unblock the Notifications












