28న రవిబాబు ‘నువ్విలా’
పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు రవి బాబు. ఆయన తాజా సినిమా 'నువ్విలా" ఈ నెల 28 విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలో ఏముందో తెలియదుగానీ పబ్లిసిటీ మాత్రం వెరైటీగా మొదలు పెట్టాడు దర్శకుడు. ఎక్కడ చూసిన క్యూట్ బేబీలతో కూడిన పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమాలో ఏముందనే ఆసక్తి సర్వ్రతా నెలకొంది.
నువ్విలా సినిమా యూత్ ఫుల్, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ఆరుగురు కొత్త నటులు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి, ఆర్ట్: నారాయణరెడ్డి
రవిబాబు గతంలో తీసిన అల్లరి, నచ్చావులే, అనసూయ, అమరావతి భారీ విజయాలు సాధింకపోయినా...మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే నువ్విలా సినిమా మాత్రం రవిబాబు గతంలో తీసిన సినిమాలన్నింటికంటే భిన్నంగా ఉంటుందని, అందుకే యాక్టర్లెవరో తెలియకుండా చిన్నపిల్లల ఫోటోలతో పబ్లిసిటీ చేస్తున్నారంటున్నారు. అంతా కొత్త మొహాలు కాబట్టి వారి ఫోటోలు పోస్టర్లపై ఉంటే ఎవరూ రారనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి టింగరి వేషాలతో వెరైటీగా ప్రచారం చేస్తున్నారని వాదించేవారూ లేక పోలేదు.


Click it and Unblock the Notifications











