'నువ్వు-నేను' అనిత కూడా ఆ రూట్ లోనే...

By Srikanya

సరైన అవకాశాలు లేకపోవటంతో చాలా మంచి హీరోయిన్స్ ఆ తర్వాత కాలంలో ఐటం గర్ల్ గా అవతరించి అలరించటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. తాజాగా ఈ లిష్టులో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు-నేను చిత్రంతో పరిచయం అయిన అనిత చేరింది. ఆమె చిరకాలం తర్వాత తెలుగులో 'కళవర్‌ కింగ్‌' అనే చిత్రంతో ఐటం పాపగా డాన్స్ లు వేస్తోంది. ప్రస్తుతం ఆమెపై ఆ సాంగ్ ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ 'కళవర్‌ కింగ్‌' చిత్రంలో నిఖిల్, శ్వేతబసు జంటగా చేస్తున్నారు. ఎల్.సురేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత డి.ఎస్.రావు నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు ఈ సినిమా గురించి చెబుతూ..''మా కథానాయకుడి చేష్టలకు కళవర్‌కింగ్‌ అనే పేరు చక్కగా సరిపోతుంది. హీరోయిన్‌ను ఆటపట్టించడానికి అతడు చేసిన ఓ పని వారిద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందన్నది ఆసక్తికరమైన కథనం. ఆద్యంతం వినోదాన్ని ఆస్వాదించవచ్చ''న్నారు. ఇక ఈ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న అనిత కెరిర్ విజయవంతంగా కొనసాగాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X