ఆమె చనిపోవడం బాధించింది, సీటు బెల్టు వల్లే బ్రతికా: ‘నువ్వు తోపురా’ హీరో సుధాకర్

Recommended Video

Nuvvu Thopu Raa Hero Sudhakar Komakula Emotional Words After Injury || Filmibeat Telugu

'నువ్వు తోపురా' చిత్ర బృందం ప్రయాణిస్తున్న వాహనం శనివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మంగళగిరి వద్ద వారి కారు అదుపు తప్పి ట్రాక్టర్‌కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న లక్ష్మీ అనే మునిసిపల్ కార్మికురాలు మరణించారు. చిత్ర హీరో సుధాకర్‌, ఇతరులు స్వల్పగాయాలతో బయట పడగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో హీరో సుధాకర్ కారు నడుపుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నారు, డ్రైవర్ పక్క సీట్లో సుధాకర్‌ కూర్చుని ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు చిత్ర బృందం మీడియా ముందుకొచ్చారు.

నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు

నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు

‘‘నా జీవితంలో అత్యంత బాధారమైన రోజు ఇది. ఇప్పటికీ నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. లక్ష్మీగారు చనిపోవడాన్ని తట్టుకోలేక పోతున్నాను. సినిమా ప్రమోషన్ కోసం వెళుతూ 11.30 గంటలకు మంగళగిరిలో ఉన్నాం. మాటీంతో కోఆర్డినేట్ చేసి పాసింజర్ సీట్లో కూర్చున్నాను. అందరికీ మెసేజ్ చేస్తుండగా సడెన్‌గా యాక్సిడెంట్ జరిగింది.'' అని సుధాకర్ తెలిపారు.

సీటు బెల్టు వల్లే బ్రతికా

సీటు బెల్టు వల్లే బ్రతికా

‘‘లక్కీగా నేను సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల బ్రతికాను. లేకుంటే హెడ్ ఇంజురీ అయ్యేది. యాక్సిడెంట్ అయ్యాక కొంతసేపు షాక్ లోనే ఉన్నాను. అక్కడ ప్రజలంతా మాకు సహాయం చేశారు. అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి పంపారు. డాక్టర్లు, పోలీసులు, మీడియా చాలా హెల్ప్ చేసింది. మా డ్రైవర్ క్రిటికల్ కండీషన్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.'' అని తెలిపారు.

దయచేసి ఫాల్స్ న్యూస్ వేయొద్దు

దయచేసి ఫాల్స్ న్యూస్ వేయొద్దు

‘‘యాక్సిడెంట్ సమయంలో నా ఫోన్ మిస్సయింది. అందుకే వెంటనే ఎవరికీ ఇన్పార్మ్ చేయలేక పోయాను. కొన్ని వెబ్ సైట్లు నేను డ్రైవ్ చేస్తున్నట్లు రాశాయి. అలా రాస్తున్న వారికి ఒకటే విన్నపం... అసలు విషయం తెలుసుకోకుండా ఇలాంటి పాల్స్ ఇన్ఫార్మేషన్ రాయవద్దు. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఇలాంటి వార్తలు విని బాధపడతారు.'' అని సుధాకర్ చెప్పుకొచ్చారు.

వారి కుటుంబానికి సహాయం చేస్తాం

వారి కుటుంబానికి సహాయం చేస్తాం

‘‘అన్నింటికంటే బాధ లక్ష్మీగారు చనిపోవడం. వాకిరి కుటుంబానికి మా వంతు సహాయం చేస్తాం. ఇలా జరుగడం దురదృష్టకరం. నేను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నాను.'' అని సుధాకర్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మీడియాతో పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X