‘ఐ’కలెక్షన్లు బావున్నాయని ప్రకటించిన నిర్మాత
హైదరాబాద్: విక్రమ్ హీరోగా ప్రముఖ సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిల్మ్స్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసాయి.

మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేతలలో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ సినిమా గురించి మాట్లాడుతూ మంచి కలెక్షన్లు సాధిస్తుందని ప్రకటించారు. ‘శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ‘ఐ' చిత్రానికి అన్ని చోట్లా అద్భుతమైన సూపర్ హిట్ టాక్ వచ్చింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది. ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తోంది. మాకు ఇది ఎంతో ఆనందంగా ఉంది. హీరో విక్రమ్ నటన గురించి మాటల ద్వారా చెప్పడం చాలా కష్టం. ఆయన లింగేశమ్ పాత్రలో అద్భుతంగా తనదైన శైలిలో జీవించాడు. ఐ చిత్రం చూసిన ప్రేక్షకులందరూ అభినందనలు కరిపిస్తూ విజువల్ ట్రీట్ అని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు' అని తెలిపారు.
నిర్మాత చెబుతున్న విషయాలు అలా ఉంటే...బయట టాక్ మరోలా ఉంది. సాధారణ ప్రేక్షకుల నుండి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి యావరేజ్ రేటింగే ఇవ్వరడం గమనార్హం. రోటీ రివేంజ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. అయితే విక్రమ్ నట, విజువల్స్ కు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











