దటీజ్ రజనీకాంత్.. బాబా సినిమాకు నష్టం వస్తే..
రజనీకాంత్ తెలుగు అభిమానుల్ని ఈ చిత్రం అలరిస్తుంది. ఆయన ఆల్‌టైమ్ ఫేవరేట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకముంది అన్నారు. సినిమా ఇండస్ట్రీలో కనబడే దేవుడు రజనీకాంత్ అని, మంచితనం, నిజాయితీ, నిబద్దతలో ఆయనకు ఎవరూ సాటిలేరని నిర్మాత ఎన్వీప్రసాద్ చెప్పారు.
కాలా చిత్ర ఆడియో కార్యక్రమంలో ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో బాబా చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్ ఫోన్ చేసి సినిమా ఎలా ఆడుతున్నదని అడిగారు. అందుకు బాగానే ఆడుతున్నదని చెప్పాను.

కొన్ని రోజుల తర్వాత రజనీకాంత్ ఫోన్ చేసి రమ్మన్నారు. బాబా సినిమా ఆడకపోవడం వల్ల వచ్చిన నష్టాన్ని తీసుకోమని డబ్బు ఇచ్చారు. డబ్బు వెనుకకు తిరిగి ఇవ్వడంతో నేను షాక్‌కు గురయ్యాను అని ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా రజనీకి సంబంధించిన మరో విషయాన్ని ఆయన వెల్లడించారు.
ముంబైలో తాను ఓ హిందీ సినిమా చూసి బాగుందని అని ఫోన్ చేసి చెప్పాను. ఒకవేళ మీరు నటిస్తే ఆ సినిమాను తెలుగు, తమిళంలో తీస్తాను అని చెప్పాను. వెంటనే చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లి వెంటనే సినిమా చూసి ఫోన్ చేశారు. సినిమా బాగుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా చేయలేను. మరో పనిలో ఉన్నాను. సినిమాను మైండ్‌లో పెట్టుకొంటే ఆ సినిమా చేయలేము అని నాకు రజనీ చెప్పారు అని ప్రసాద్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











