twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ పిలిచి మరీ... లక్ష లాభంతో ఆ డబ్బు తిరిగిచ్చారు: ఎన్వీ ప్రసాద్

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'కాలా' జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా సినిమా విడుదలవుతుండటంతో హైదరాబాద్, ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్ తన అల్లుడు, నిర్మాత ధనుష్, చిత్రబృందంతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్‌లో ప్రమోషనల్ ఈవెంటులో పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.... రజనీకాంత్‌తో చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. 'బాబా' సినిమా సమయంలో తెలుగు వెర్షన్ నాకు(సీడెడ్) ఒక్కడికే ఇచ్చారు. ఆంధ్ర, నైజాంలో సొంతగా రిలీజ్ చేసుకున్నారు. రిలీజైన వారం తర్వాత ఎలా ఉంది అని ఫోన్ చేశారు. ఫర్వాలేదు సార్ యావరేజ్ అనిచెప్పాను. నెల రోజుల తర్వాత వారి మేనేజర్ ఫోన్ చేశారు. మీరు ఒకసారి వస్తే మాట్లాడతానని చెప్పి మా దగ్గర సినిమాకు సంబంధించిన అకౌంట్స్ తీసుకున్నారు. ఆ లెక్కలు తేలిస్తే కోటి 60 లక్షల నష్టం అని తేలింది. ఆ కోటి 60 లక్షలతో పాటు లక్ష రూపాయల ప్రాఫిట్ కలిపి డబ్బు నాకు తిరిగి ఇచ్చారు... అని గుర్తు చేసుకున్నారు.

    NV Prasad speech at Kaala Hyderabad Event

    అపుడు రజనీకాంత్ నాకు ఒకటే మాట చెప్పారు. 'ఈ డబ్బు నేను దుబాయ్ కి ఏమైనా తీసుకెళతానా? నా తృప్తి కోసం ఈ సినిమా చేశాను. అందుకోసమే ఆంధ్రా, నైజాం ఎవరికీ అమ్మకుండా నేను సొంతంగా రిలీజ్ చేసుకున్నాను. నువ్వంటే తెలుసు కాబట్టి నీకు సీడెడ్ రైట్స్ ఇచ్చాను' అన్నారు. ఇండస్ట్రీలో మనకు కనబడే దేవుడు రజనీకాంత్. ఇన్నాళ్లకు ఈ విషయం నేను చెప్పుకునే అవకాశం వచ్చింది. నేను ఆయన్ను పొగడటం లేదు. ఆయన నిజాయితీ నిబద్దత ఎలా ఉంటుంది అని చెప్పడానికే ఈ విషయం చెప్పాను అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.

    English summary
    NV Prasad speech at Kaala Hyderabad Event. Kaala film written and directed by Pa. Ranjith and produced by Dhanush. Starring Rajinikanth in the lead role, released on 7th June 2018. The film will be released in Tamil, Telugu, Malayalam, Nepali, Hindi and Assamese.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X