twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.ఓ సంచలనాలు.. 70కోట్లు, 80 కోట్లు అంటూ.. తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్క ఇదే!

    |

    Recommended Video

    NVR Cinemas Distribute Rajini's 2.0 In Andhra,Telangana

    సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు శంకర్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న 2.ఓ చిత్ర సందడి అప్పుడే ప్రారంభమై పోయింది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఆడియన్స్ లో, ట్రేడ్ వర్గాల్లో 2. ఓ చిత్రం గురించి ఉత్కంఠ పెరిగిపోతోంది. సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి.. అక్షయ్.. చిట్టి మధ్య పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయి అని ఆడియన్ చర్చించుకుంటున్నారు. ట్రేడ్ విశ్లేషకులు మాత్రం ఈ చిత్ర బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుంది.. బాహుబలి రికార్డులని అందుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. తాజగా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తి రేపుతోంది.

    2.0కు సవాల్.. శంకర్, రజనీ గుండెల్లో రైళ్లు.. పైరసీ బాంబు పేల్చిన వెబ్‌సైట్!2.0కు సవాల్.. శంకర్, రజనీ గుండెల్లో రైళ్లు.. పైరసీ బాంబు పేల్చిన వెబ్‌సైట్!

    గత ఏడాదే రావాల్సింది

    గత ఏడాదే రావాల్సింది

    వాస్తవానికి 2.ఓ చిత్రం గత ఏడాదే విడుదల కావలసి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి పనుల్లో జాప్యం వలన 2. ఓ చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాదే ఈ చిత్రం విడుదలతుంది అని అంతా అనుకుంటున్నా సమయంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ గురించి సంచలన ప్రచారం జరిగింది.

     70 కోట్లు.. 80 కోట్లు అంటూ

    70 కోట్లు.. 80 కోట్లు అంటూ

    గత ఏడాది నుంచే 2.ఓ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రలో 70 నుంచి 80 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. 80 కోట్లు అంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా బిజినెస్ తో సమానం. రోబో చిత్రం సృష్టించిన సంచలనం తరువాత ఆ స్థాయిలో 2.ఓ బిజినెస్ జరగడంలో ఆశ్చర్యం లేదు.

    ప్లాన్ మారిందా

    ప్లాన్ మారిందా

    మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం విడుదలవుతుంది అనగా తెలుగు రాష్ట్రాల ప్రై రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. కమిషన్ విధానం ద్వారా ఎన్విఆర్ సినిమాస్ సంస్థ తెలుగులో 2.ఓ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు లైకా ప్రొడక్షన్స్ సంస్థకు, ఎన్విఆర్ సంస్థకు మధ్య ఒప్పందం జరిగిందట.

    500 కోట్ల బడ్జెట్

    500 కోట్ల బడ్జెట్

    ప్రాంతీయ భాషల పరంగా చూస్తుంటే తెలుగులో అతిపెద్ద మార్కెట్ ఉంది. అందుకే బాలీవుడ్ చిత్రాలు సైతం తెలుగులో డబ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 500 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న 2.ఓ చిత్ర విషయంలో కూడా నిర్మాతలు పథకం ప్రకారమే అడుగులు వేస్తుండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

    హైలైట్ కాబోయే అంశాలు

    హైలైట్ కాబోయే అంశాలు

    శంకర్ సినిమా అంటే సరికొత్త అనుభూతి కలుగుతుంది. తన దర్శకత్వ ప్రతిభతో శంకర్ ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తాడు. 2.ఓ చిత్రంలో కూడా అదే జరగబోతోందని అంచనా వేస్తున్నారు. చిట్టి చేసే సాహసాలు, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ చేసే విన్యాసాలు, అమీజాక్సన్ మెరుపులు ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

    English summary
    NVR Cinemas to distribute Rajini’s '2.0' in Andhra, Telangana While the rights of the film will remain with Lyca Productions, NVR Cinemas will be distributing it on a commission basis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X