అక్రమ సంభందాల ఆంటీ కథ
హైదరాబాద్ : సోనీ, శిరీష ప్రధాన పాత్రలో శ్రీ వెంకటరామ క్రియేషన్ పతాకంపై కె.ఎస్. ప్రసాద్ దర్శకత్వంలో బి.ఆర్. ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఓ ఆంటీ కథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బి.ఆర్.ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత మాట్లాడుతూ...'సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధం వల్ల ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనే అంశంతో తెరకెక్కించిన చిత్రమిది. గుండు హనుమంతరావు, గౌతంరాజు, కోట శంకర్రావు, కృష్ణమోహన్ తదితరులతోపాటు కొత్తవారు కూడా నటించారు. దర్శకుడు కె.ఎస్.ప్రసాద్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. మూడు పాటలు ఉన్నాయి ఈ చిత్రంలో. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ తొలివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, వాటితో ఎన్ని అనర్థాలకు గురౌతున్నారో అనే వాస్తవాన్ని చిత్ర దర్శకుడు తెరపై ఆవిష్కరించారని తెలిపారు. మూడు పాటలతో ముస్తాబైన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
గుండు హనుమంతరావు, కోట శంకర్రావు, కృష్ణమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రమేష్, పాటలు: కైలాస్, సంగీతం: లలిత్-సురేష్, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, ఎడిటింగ్: నందమూరి బెనర్జీ, నిర్మాత: బి.ఆర్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.ప్రసాద్.


Click it and Unblock the Notifications











