బూతుకు పరాకాష్టలా పోస్టర్స్
హైదరాబాద్: ఈ రోజుల్లో, బస్ స్టాప్ చిత్రాల పుణ్యామా అని సాప్ట్ పోర్న్ చిత్రాలు తెలుగులో వరస పెట్టి దూకేస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్లు ఈ తరహా చిత్రాల వల్ల లాభాలు ఖాయం అనే నమ్మకంగా రెడీ అవుతున్నారు. తాజాగా 'ఓ ఆంటీ కథ' టైటిల్ తో రూపొందిన చిత్రం పోస్టర్స్ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. సోనీ, శిరీష ప్రధాన పాత్రధారులుగా శ్రీ వెంకటరామా క్రియేషన్స్ పతాకంపై కె.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో బి.ఆర్.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఓ ఆంటీ కథ' షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.
చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, వాటితో ఎన్ని అనర్థాలకు గురౌతున్నారో అనే వాస్తవాన్ని చిత్ర దర్శకుడు తెరపై ఆవిష్కరించారని తెలిపారు. మూడు పాటలతో ముస్తాబైన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
గుండు హనుమంతరావు, కోట శంకర్రావు, కృష్ణమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రమేష్, పాటలు: కైలాస్, సంగీతం: లలిత్-సురేష్, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, ఎడిటింగ్: నందమూరి బెనర్జీ, నిర్మాత: బి.ఆర్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.ప్రసాద్.


Click it and Unblock the Notifications












