జగపతి బాబు-కళ్యాణి ‘ఓ మనిషి కథ’ ఆడియో
హైదరాబాద్: జగపతి బాబు -కళ్యాణి ల సూపర్ హిట్ కాంబినేషన్ లో రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో బాలాభాయ్ చొవాటియా నిర్మించిన చిత్రం ''ఓ మనిషి కథ ''. బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఆడియో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, విజయ్ భాస్కర, సంగీత దర్శకులు విజయ్ కురాకుల, దర్శక నిర్మాతలు రాధాస్వామి, బాలాభాయ్ తదితరులు హాజరయ్యారు. ఆదిత్య ద్వారా మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు దర్శక నిర్మాతలు.

ఒక మనిషి జీవితంలోని సమస్యలను, ఎదుర్కోవడానికి ఆ మనిషి పడే ఆరాటాన్ని దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించారని వక్తలే పేర్కొన్నారు. ఎమోషనల్ సీన్స్‌లో జగపతిబాబు పలికించిన హవభావాలు చాల బాగున్నాయి. కళ్యాణి గృహణిగా బాగా నటించింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చిపెడుతుంది అన్నారు.
ముఖ్యంగా జగపతి బాబు నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ఆయువుపట్టుగటా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగల సత్తా ఉన్న చిత్రమిది అన్నారు.


Click it and Unblock the Notifications











