తండ్రిగా నా సపోర్ట్ అంతా ఇచ్చాను.. సంజయ్‌తో ఒకేఒక్క మాట చెప్పా: బ్రహ్మాజీ

తెలుగులో పలు సినిమాల్లో నటించి విలక్షణ పాత్రలతో మెప్పించాడు నటుడు బ్రహ్మాజీ. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఇప్పుడు తన కొడుకు సంజయ్‌ని రంగంలోకి దించుతున్నారు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'ఓ పిట్ట కథ'. తెలుగులో గతంలో ఎన్నడూ రానటువంటి వైవిద్యభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. షూటింగ్ కంప్లీట్ చేసుకొని మార్చి 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

O Pitta Katha: Brahmaji Comments On his son Sanjay

అయితే తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన బ్రహ్మాజీ.. నా కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తానని నాతో చెప్పినప్పుడు, 'ట్రై చేయి .. వర్కౌట్ అయితే ఉండు, లేదంటే మరేదైనా పని చూసుకో' అని ఒకే ఒక మాట చెప్పానని అన్నాడు. అయితే అతన్ని సోలో హీరోగానే పరిచయం చేయమని సన్నిహితులు చెప్పారని, అందుకే 'ఓ పిట్ట కథ' లాంటి ఆసక్తికర కథాంశంతో పరిచయం చేస్తున్నానని చెప్పాడు.

ఓ తండ్రిగా కొడుకును ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకూ చేశానని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో తాను చేసిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర కూడా అందరినీ ఆకర్షిస్తుందని బ్రహ్మాజీ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X