twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నాయక్’ చిత్రంపై కొమురంపులి తరహా వివాదం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా 'కొమురం పులి' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 'కొమురం' అనే పదంపై తెలంగాణ ప్రాంతంలో వివాదం నెలకొనడంతో చివరి నిమిషయంలో దాన్ని తీసేసి 'పులి' అనే టైటిల్ తో సినిమాను విడుదల చేసారు.

    తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రంపై కూడా అదే తరహా వివాదం నెలకొంది. ఈ సినిమాకు 'నాయక్' అనే టైటిల్ పెట్టడాన్ని తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం నేతలు తమ అభ్యంతరం వ్యక్తం చేసారు.

    గిరిజన ఆత్మగౌరవానికి సంబంధించిన 'నాయక్' అనే పదాన్ని వాడరాదని, ఈ పదం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని సినిమా వ్యాపారం కోసం వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, వెంటనే 'నాయక్' టైటిల్ ను మార్చాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. గిరిజన తెగకు చెందిన లంబాడీల పేరు చివరన 'నాయక్'(ఉదా : రాజు నాయక్, శ్రీను నాయక్) అనే పదం వస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    
 Telangana Tribal Student Association has raised objection on Ram Charan's Naayak movie. As the title hurt their sentiments and feelings.They are demanded that immediate removal of the title for the film other wise they would take it seriously.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X