ఎన్టీఆర్ కి మహేష్ ఛాలెంజ్ విసిరిన మ్యాటర్
దసరాని పురస్కరించుకుని తెలుగు సినిమా బరిలో ఎన్టీఆర్,మహేష్ పోటాపోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహేష్ తాజాగా అక్టోబర్ నెల నాదే..అని స్టేట్మెంట్ ఇవ్వటంతో అంతటా ఇది ఎన్టీఆర్ కు విసురుతున్న సవాలేనంటున్నారు. ఎన్టీఆర్ బృందావనం, మహేష్..ఖలేజా చిత్రాలు ఒక రోజు తేడాలో అక్టోబర్ లో విడుదుల అవుతున్నాయి. అయితే మహేష్ గత చిత్రాలు అక్టోబర్ లో ప్లాపు అయ్యాయి కాబట్టి...రిలీజ్ డేట్ మారుస్తాడని నవంబర్ కి ఫోస్ట్ ఫోన్ చేస్తాడని వినిపించింది. దీనికి సమాధానంగా మహేష్ స్పందిస్తూ...అక్టోబర్ లో నా చిత్రాలు ప్లాపయ్యానే రూమర్స్ వస్తున్నట్టకీ ఈ ఖలేజా చిత్రం చాలా ఢిఫెరెంట్. ఇదీ ప్రతీదీ మారుస్తుంది. ఇక నుంచి అక్టోబర్ నా నెల..అలాగే ఖలేజా అక్టోబర్ ఏడున రావటం ఖాయం...మరోసారి కన్ఫర్మ్ గా చెప్తున్నా అక్టోబర్ ఏడే అంటూ ట్వీట్ చేసి ధీమాను వ్యక్తం చేసారు. ఏదైమైనా హీరోల మధ్య ఇలాంటి హెల్దీ కాంబిటేషన్ ఉంటే క్వాలిటీ పెరుగే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











