తెరపైకి దగ్గబాటి అభిరామ్ పేరు, మోహన్‌లాల్ మూవీతో...
కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒడియన్' తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రం హక్కులను 'దగ్గుబాటి క్రియేషన్స్' దక్కించుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సినిమా కోసం చాలా మంది బడా నిర్మాతలు పోటీ పడ్డప్పటికీ... దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి అభిరామ్, సంపత్ ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారట. సురేష్ ప్రొడక్షన్ వారి అనుబంధ సంస్థే ఈ దగ్గుబాటి క్రియేషన్స్ అని చెప్పుకుంటున్నారు.
సినిమా విషయానికొస్తే...విఏ శ్రీకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ రెండు విభిన్నమైన పాత్రలు... ఒడియన్, మానిక్యన్‌గా కనిపించబోతున్నాడు. మనుషులను జంతువుల రూపంలో దాచి పెట్టే ఒడి విద్య అనే మ్యాజిక్ ట్రిక్ ఇందులో చూపిస్తారని తెలుస్తోంది.

పలు కారణాలతో ఊరు విడిచి వెళ్లిన మానిక్యన్ ఒడియన్‌గా తిరిగి వచ్చి ఊరి మంచి కోసం ఏం చేశాడు అనే స్టోరీ లైన్ తో సినిమా నడిస్తుంది. మోహన్ లాల్ స్టైల్ మాస్ యాక్షన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సిద్ధిఖి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇందులో మోహన్ లాల్ యంగ్ లుక్‌తో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పీటర్ హెయిన్స్ యాక్షన్ స్టంట్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











