ఆఫీసర్ కథ కంచికి.. వారం కూడా గడవక ముందే, విశాల్ తప్పించుకున్నట్లేనా!

Recommended Video

Officer Movie Almost Closed All Areas, Kaala Effect On Box Office

రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ చిత్రం కంచికి చేరింది. అక్కినేని, ఆర్జీవీ అభిమానుల్లో మినహా ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. నాగార్జున కెరీర్ లోనే అత్యంత దారుణమైన పరాజయంగా ఈ చిత్రం నిలిచింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం కోటి కూడా సాధించే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజనికాంత్ కాలా చిత్రంతో సునామీలా దూసుకువచ్చాడు. డెఫిషిట్ లో రన్ అవుతున్న ఆఫీసర్ చిత్రం కాలా దెబ్బకు పూర్తిగా కనుమరుగైపోయింది.

నాగార్జున కెరీర్ లోనే

నాగార్జున కెరీర్ లోనే

కింగ్ నాగార్జున కెరీర్ లోనే ఆఫీసర్ చిత్రం అత్యంత చెత్త చిత్రంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈవిషయంలో వర్మ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

కాలా దెబ్బ

కాలా దెబ్బ

సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రం విడుదల కావడంతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఆఫీసర్ చిత్రాన్ని తొలగించారు. విడుదలై వారం కూడా పూర్తి కాకముందే ఇలాంటి ఆఫీసర్ చిత్రం కనుమరుగవడం గమనార్హం.

ఆఫీసర్ కు మాత్రమే కాదు

ఆఫీసర్ కు మాత్రమే కాదు

కాలా విడుదల ఎఫెక్ట్ కేవలం ఆఫీసర్ చిత్రానికి మాత్రమే కాదు, గత వారం విడుదలైన అభిమన్యుడు చిత్రంపై కూడా పడిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

గట్టునపడ్డ అభిమన్యుడు

గట్టునపడ్డ అభిమన్యుడు


అభిమన్యుడు చిత్రం గత వారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో విజయం సాధించడంతో ఈ చిత్ర తెలుగు హక్కులు దాదాపు 4 కోట్లకు అమ్ముడయ్యాయి. తొలి వీకెండ్ లోనే 3 కోట్ల షేర్ వరకు అభిమన్యుడు సాధించినట్లు తెలుస్తోంది. కాలా చిత్రం తరువాత ఆడియన్స్ ఉన్న సెకండ్ ఆప్షన్ అభిమన్యుడే కాబట్టి సులభంగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X