ఆఫీసర్ మ్యూజిక్ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్!
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున సినిమాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం నిరాశ పరిచింది. అంతే కాదు దర్శకుడు వర్మపై సోషల్ మీడియాలో విమర్శలు సైతం వస్తున్నాయి. నాగార్జున లాంటి స్టార్ హీరో క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రం తొలి రోజు 50 లక్షలు కూడా వసూలు చేయలేకపోయింది.
ఈ చిత్రం ద్వారా నటీనటులకు కానీ, ఇతర సాంకేతిక నిపుణులకు కానీ పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. కానీ ఈ చిత్రానికి సంగీతం అందించిన సుదరం రవిశంకర్ మాత్రం బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఓ హాలీవుడ్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కినట్లు రవిశంకర్ తెలిపాడు.

విశాఖ జిల్లాకు చెందిన రవిశంకర్ అనకాపల్లి లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానని రవిశంకర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











